ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రైతులకు రాయితీపై సౌర విద్యుత్తు

ఖమ్మం, జనవరి 16: రైతులు కరెంటు కొరతతో ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేయడానికి సౌర విద్యుత్తును రాయితీపై ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రజలు కరెంటు బిల్లులు కట్టే పరిస్థితిలో లేకుండా పోయారని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చీకటి రాజ్యాన్నిచ్చిందని ప్రజలకు వివరించారు.
మన బియ్యం, మంచి బియ్యం ఇస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది.. ఇన్నాళ్లు పురుగులు, రాళ్ల బియ్యం ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టే కదా..?అంటూ చంద్రబాబు నిలదీశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామానికి చేరుకోవడంతో బాబు 1700 కి.మీ మైలురాయిని దాటారు. ఈ గ్రామంలో బంతిపూలతో అలంకరించి భారీ ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. బుధవారంతో ఖమ్మం జిల్లాలో 8వ రోజు యాత్ర పూర్తయ్యింది. నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగించారు. 'ఈ ముఖ్యమంత్రి అవినీతిపరుడు.. బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకొని డబ్బు కాజేశాడని' ఆరోపించారు. వైఎస్‌దంతా నేరాలమయం... 40 ఏళ్ల క్రితమే పులివెందులలో ఒకరిని పెట్రోల్‌ పోసి హత్య చేశారు.. పోలీసులు రౌడీషీటు తెరిచారు.. అప్పుడు తెదేపా లేదుకదా.. అని చంద్రబాబు అడిగారు. ఆయనతోనే రాష్ట్ర పతనం మొదలయ్యిందని దుయ్యపట్టారు. రైతులు కష్టాలతో సహజీవనం చేస్తున్నారు.. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు.. వాళ్ల ఇబ్బందులన్నీ రుణమాఫీతో తీరిపోతాయని చంద్రబాబు పేర్కొన్నారు. రోజూ 5,6మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్‌, వైకాపాలకు వెటకారంగా ఉందని ఆగ్రహించారు. కోట్ల డబ్బు కాజేసి కోర్టు ఆదేశాలతో జైలుకెళ్లిన జగన్‌కు ఎవరో అన్యాయం చేసినట్టు దేశ ప్రథమపౌరునికి సంతకాల సేకరణ చేసి నివేదించడం దారుణమని బాబు వ్యాఖ్యానించారు. జనం సంతకాలతోనే జగన్‌ నిర్ధోషిగా పేర్కొంటూ వైఎస్‌ భార్య పేర్కొనడం సరికాదన్నారు. మైనింగ్‌ వ్యవహారంలోనూ మాఫియా వచ్చేసింది.. గాలి జనార్థన్‌రెడ్డి 40-50వేల కోట్లు మైనింగ్‌లో కాజేసి కర్ణాటక రాష్ట్రప్రభుత్వాన్ని మార్చేసేలా తయారయ్యారని చెప్పారు. అలాంటి మాఫియాతోనే ఖమ్మం జిల్లా అప్పల నర్సింహ్మపురంలో తెదేపా నేతను చంపేశారని ఆరోపించారు. వైఎస్‌ తన అల్లునికి కట్నంగా 1.46లక్షల ఎకరాల బయ్యారం ఇనుప ఖనిజాన్ని ఇచ్చారని తెలిపారు.

కామెంట్‌లు