ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఉపాధి హామీ పథకం కింద రూ. 226 కోట్ల వ్యయం

పాడేరు, చైతన్యవారధి: 2012-2013 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు రూ. 226 కోట్లు వ్యయం చేసి 5.12 లక్షల మందికి పనులు కల్పించామని డ్వామా పీడీ సత్యసాయి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మన్యంలోని 11 మండలాల్లోని ఉపాధి హామీ పథకం సిబ్బందితో గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో
ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో కాఫీ అవినీతిపై వస్తున్న కథనాలను పరిగణంలో తీసుకొని సమగ్ర విచారణ చేపడతామన్నారు. దీనిపై కలెక్టరు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. వారం రోజులలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక సామాజిక ఆడిట్‌ బృందాలు నాలుగైదు వస్తాయని తెలిపారు. కాఫీ అవినీతిపై తప్పు జరిగితే ఎంతటి వారైన క్షమించేది లేదన్నారు. ఇప్పటి వరకు 275 వేల కుటుంబాల వలసలు నివారించినట్లు వెల్లడించారు. మన్యం ప్రాంతంలో ఉపాధి హామీ పథకంలో సగటున ప్రతి కుటుంబానికి 65 పని దినాలు కల్పించామన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 50 వేలు వరకు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఏజెన్సీలో 2 లక్షల 78 కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించినట్లు తెలిపారు. పథకం ప్రారంభం నుంచి నేటి వరకూ రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాఫీ తోటల పెంపకానికి రూ. 43.5 కోట్లు వ్యయం చేశామన్నారు. వాస్తవానికి రూ. 93 కోట్లు వ్యయం జరగాల్సి ఉందన్నారు. పనులు సక్రమంగా జరగకపోవడం వల్ల చెల్లింపులు చేయలేదని తెలిపారు. మన్యంలో లక్షా 75 వేల కుటుంబాలకు ఉపాధి కార్డులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. లక్షా 8 వేల కుటుంబాలు ఉపాధి పనులు చేస్తున్నారన్నారు. మన్యంలో రూ. 103 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో మంచి ఫలితాలు సాధించినందుకు జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని, జాతీయ స్థాయి పురస్కారం కూడా అందుకోవడానికి విశాఖ జిల్లా చేరువలో ఉందన్నారు. ప్రతి మండలంలో రెండు విభాగాలు కింద ఇద్దరు అధికారులు పర్యవేక్షిస్తే అక్రమాలు అరికట్టవచ్చని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పిడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆరోపణులు ఎదుర్కొన్న సిబ్బందిని విధుల నుంచి తొలిగించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15 నాటికి సామాజిక తనిఖీలు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీలు కోరాబు చక్రవర్తి, ప్రసాద్‌, నాగేశ్వరరావు, ఉషారాణి, 11 మండలాల ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు