ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాష్ట్రాన్ని విడగొడితే ప్రతిఘటిస్తాం

అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న అఃలపక్షాన్ని ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తే తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని సమైక్రాంధ్ర విద్యార్థి సంఘ జేఏసీ కన్వీనర్‌ ఆడారికిశోర్‌ హెచ్చరించారు. అనకాపల్లిలోని తన స్వగృహంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రహోంశాఖ మంత్రి షిండే తెలంగాణా అంశంపై అఃలపక్షం ఏర్పాటుచేయడాన్ని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రణబ్‌,
రోశయ్య, శ్రీకృష్ణ కమిటీలంటూ ఇప్పటికే మూడు కమిటీలు ఏర్పాటు చేశారని వీరంతా సమైక్యాంధ్రతోనే అభివృద్ధి సాధ్యమని తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు తిరిగి అఃలపక్షాన్ని ఎందుకు ఏర్పాటుచేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అఃలపక్షంలో పాల్గొనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపించాలని పిలుపునిచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సమ్మతమే అన్నట్లుగా ప్రకటనలు చేసున్నారని, ఇదే కొనసాగిస్తే సీమాంధ్రలో తెదేపా శ్రేణులను నిలదీస్తామన్నారు. తెలుగుజాతిని విడగొట్టే ప్రయత్నాన్ని కేంద్రప్రభుత్వం విరమించుకోవాలని చెప్పారు. సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపించేలా త్వరలోనే అందరి మద్దతుతో సమైక్యాంధ్ర జేఏసీ రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న నిర్వహిస్తున్న అఃలపక్షం సమావేశం సందర్భంగా సమైక్యాంధ్ర కోసం ఈ నెల 22న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో విశాఖపట్నంలో అఃలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో సమైక్యాంధ్ర జేఏసీ యువజన సంఘ అధ్యక్షులు కొండ్రేగుల రవికుమార్‌, సభ్యులు గోపి, జగన్‌, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు