ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేటి నుంచి సీఎం ఇందిరమ్మబాట

-45 కార్యక్రమాలు, ఏడు బహిరంగ సభలు
రూ.500 కోట్ల విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
విశాఖపట్నం, చైతన్యవారధి:ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఇందిరమ్మబాట కార్యక్రమం సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. 45 కార్యక్రమాలు, ఏడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. మూడు రోజుల
వ్యవధిలో సుమారు రూ.500 కోట్ల విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సీఎం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు నియోజకవర్గాలతో పాటు ప్రభుత్వ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్‌, వెలగపూడి రామకృష్ణబాబు, చింతలపూడి వెంకటరామయ్య, మళ్ల విజయప్రసాద్‌, బోళెం ముత్యాలపాప ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సీఎం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నగరంలో అడుగుపెట్టినప్పటికీ భోజన విరామ సమయం మినహా మిగతా సయమంతా ఎదో ఒక కార్యక్రమంలో సీఎం పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులందర్నీ సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షణకు కలెక్టర్‌ నియమించారు.

సోమ, మంగళ, బుధవారాల్లో జరగనున్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం 8గంటలకు విమానంలో విశాఖకు వస్తారు. విమానాశ్రయ వి.ఐ.పి.లాంజ్‌లో కొద్దిసేపు సీఎం విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 9.45 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న మల్కాపురం వెళతారు. అక్కడ జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం కింద చేపట్టనున్న పథకాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం నుంచే సీఎం ఇందిరమ్మబాటకు శ్రీకారం చుడతారు. అక్కడ నుంచి ఎ.యు.కాన్వొకేషన్‌ హాలుకు వెళతారు. అక్కడ నగర ప్రాంత స్వయం సహాయక గ్రూపుల సభ్యులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి బీచ్‌రోడ్డులో రాజీవ్‌ గాంధీ స్మృతి భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత గవర్నర్‌ బంగ్లాకు చేరుకొని మధ్యాహ్న భోజనం తీసుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటలకు భీమిలి సెగ్మెంట్‌ పరిధిలోని పరదేశిపాలెంకు వెళతారు. అక్కడ నుంచి వరసగా మారికవలస, కాపులుప్పాడ, ఎ.యు.ఇంజినీరింగ్‌ కళాశాల, పెదవాల్తేర్‌లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు గవర్నర్‌ బంగ్లాకు చేరుకొని భోజనం, తదుపరి విశ్రాంతి తీసుకుంటారు. మంగళవారం పోర్టు సందర్శనతో రెండో రోజు ఇందిరమ్మబాట మొదలవుతుంది.

మంత్రి గంటా సందర్శన
ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం సందర్శించారు. బీచ్‌రోడ్డులో ఉన్న రాజీవ్‌ స్మృతిభవనం, తదుపరి పరదేశిపాలెం, మారికవలస వెళ్లి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి గంటా అధికారులను ఆదేశించారు. ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.

కామెంట్‌లు