లండన్: చందమామ కథల్లో, విఠలాచార్య సినిమాల్లో, హ్యారీపోటర్ నవలల్లో కనిపించేటువంటి అదృశ్యవ్యక్తులను తయారుచేయటం సాధ్యమేనని కెనడా కంపెనీ చెబుతోంది. హైపర్‌స్టెల్త్ అనే ఈ కంపెనీ అమెరికా, కెనడా సైన్యాల కోసం అదృశ్య వస్త్రాలను రూపొందించింది. వీటిని ధరించిన వ్యక్తి మన పక్కనున్నా కనిపించరని కంపెసీ
సీఈఓ గైక్రామర్ తెలియజేశారు. ఈ అదృశ్యవస్త్రాలకు క్వాంటం స్టెల్త్ అనే పేరు పెట్టారు. వీటితో తయారయ్యే సైనిక యూనిఫాంలను ధరించిన సైనికులు యుద్ధరంగంలో శత్రువులకు కనిపించకుండా శత్రు శిబిరంలోకి వెళ్లి మరీ విధ్వంసం సృష్టించవచ్చు. క్వాంటంస్టెల్త్‌లో కొన్ని మార్పులు చేసి యుద్ధవిమానాలకు, జలాంతర్గాములకు పైపూతగా వేస్తే శత్రుదేశాల గగనతలంలో, సముద్రాల్లో స్వేచ్ఛగా విహరించినా రాడార్లు కూడా పసిగట్టలేవని గైక్రామర్ చెప్పారు. క్వాంటంస్టెల్త్‌తో తయారైన దుస్తులు తమపైన పడే కాంతికిరణాలను తిరిగి ప్రతిఫలించకుండా కిందికి వంచుతాయని దీనివల్లే అవి అదృశ్యంగా ఉంటాయన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి