ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చట్టాలపై ప్రజల్లో అవగాహన అవసరం

-జిల్లా కలెక్టరు శేషాద్రి
అనకాపల్లి, డిసెంబరు ౨౮(చైతన్యవారధి): సమాచార హక్కు చట్టం, వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యపర్చాల్సినం అవసరం ఉందని జిల్లా కలెక్టరు శేషాద్రి అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టంపై జిల్లా వినియోగదారుల సమాఖ్య, అనకాపల్లి వినియోగదారుల మండలి అధ్వర్యంలో మండల ప్రజాపరిషత్‌ సమావేశ
భవనంలో శుక్రవారం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టరు శేషాద్రి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 2011-12లో సర్వే నిర్వహించగా 20 శాతం మందికి మాత్రమే అవగాహన ఉందని తేలిందన్నారు. గ్రామైక్య సంఘాల మహిళలు చర్చించుకొంటే, వారి ద్వారా మిగిలిన వారిలో చైతన్యం వస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలపై పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో జనవరి నుంచి అమృతహస్తం పథకం ప్రవేశపెడతామని కలెక్టరు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు, పీహెచ్‌సీ ఉప కేంద్రాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న నిధులు సక్రమంగా వినియోగపడుతోందీ లేందీ పరిశీలించాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులు, స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా నిఘా వేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకుంటే, చిత్తశుద్ధితో పరిశీలించి అసలైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షుడు కె.వెంకట రమణ అధ్యక్షతన జరిగిన సదస్సులో న్యాయవాది సి.శివయ్య, పురపాలక సంఘం కమిషనరు మురళీధరరావు, సీనియర్‌ ఆడిటర్‌ శర్మ, ఎంపీడీవో సందీప్‌, తహసిల్దారు పాండురంగారెడ్డి, వంట గ్యాస్‌ వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పి.కృష్ణపరమాత్మ సహా పలువురు మాట్లాడారు. 180 అర్జీలను కలెక్టరుకు అందజేశారు. జిల్లాలోని వినియోగదారుల సంఘాలు, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

కామెంట్‌లు