ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జపాన్‌లో భారీ భూకంపం

టోక్యో: శక్తిమంతమైన భూకంపం శుక్రవారం ఈశాన్య జపాన్‌ను వణికించింది. సముద్రంలోపల సంభవించిన ఈ ప్రకంపనల వల్ల మీటరు ఎత్తున్న సునామీ అలలు వచ్చాయి. రాజధాని టోక్యోలో భవనాలు కంపించడంతో, ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని బయటకు పరుగులు తీశారు. గత ఏడాది దాదాపు 20వేల మందిని బలిగొన్న
భూకంపాన్ని ఇది గుర్తుకు తెచ్చింది. తాజా విపత్తు వల్ల ఎవరైనా గాయాలైనట్లు ఇంతవరకూ వార్తలు రాలేదని పోలీసులు తెలిపారు. సునామీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ 75ఏళ్ల మహిళ ఒకరు గాయాలపాలైనట్లు అధికార టీవీ ఛానల్‌ ఎన్‌హెచ్‌కే పేర్కొంది. సెందాయ్‌ నగరంలో మరో చిన్నారి కూడా గాయపడినట్లు వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ సూచీపై 7.3గా నమోదైంది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.48గంటలకు ఇది సంభవించింది. మియాగి ప్రిఫెక్చర్‌ తీరానికి 240 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌మహాసముద్రంలో భూకంపకేంద్రం ఉన్నట్లు జపాన్‌ వాతావరణ పరిశోధన సంస్థ తెలిపింది. ప్రకంపనల తీవ్రత ఇవాటే, మియాగీ, అవోమోరి, ఇబ్రాకీ, టోచిగి ప్రిఫెక్చర్లలో కనిపించింది. భూకంపంనేపథ్యంలో సునామీహెచ్చరికలు జారీచేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ వచ్చిన దాదాపు గంట తర్వాత మీటరు ఎత్తున్న సునామీ అల మియాగి ప్రిఫెక్చర్‌లోని ఇషినోమాకీని తాకాయి. అణు కర్మాగారాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని ప్రభుత్వం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్‌ రైళ్లను నిలిపివేశారు. టోక్యోలో ఒక సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిన ప్రధాన మంత్రి యోషిహికో నోడా.. దాన్ని రద్దు చేసుకొని, పరిస్థితిని సమీక్షించడానికి తన కార్యాలయానికి తిరిగొచ్చారు.

కామెంట్‌లు