ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏనుగు మలం నుంచి ఖరీదైన కాఫీ

గోల్డెన్‌ ట్రయాంగిల్‌: కొత్తక వింత పాతొక రోత అన్నట్లుగా థాయ్‌లాండ్‌లోని గోల్డెన్‌ ట్రయాంగిల్‌లో ఏనుగుల మలం నుంచి ఖరీదైన కాఫీని తయారుచేస్తున్నారు. ఒక కప్పు కాఫీని 50 డాలర్లకు (దాదాపు రూ.మూడు వేలకు) విక్రయిస్తున్నారు. కేవలం థాయ్‌లాండ్‌లోనే కాదు.. మాల్దీవులు, అబుదాబీ తదితర దేశాల్లోని ఖరీదైన
హోటళ్లలోనూ ఈ కాఫీ రుచి చూపిస్తున్నారు. ఇంతకూ ఈ ఖరీదైన కాఫీ తయారయ్యేదెలా అంటే.. ఏనుగులు ఆహారంగా తీసుకునే చెరుకు గడలు, అరటిపండ్లు వంటి వాటికి కాఫీగింజలను అతికించి వాటితో తినిపిస్తున్నారు. మరుసటిరోజు ఏనుగు విసర్జించినప్పుడు మలంలోంచి ఆ గింజలను సేకరించి వాటిద్వారా కాఫీ తయారుచేస్తున్నారు. దీనికి 'బ్లాక్‌ ఐవరీ కాఫీ' అనే పేరు కూడా పెట్టారు. ఇది చాలా సాఫీగా ఉంటుందని, మామూలు కాఫీలో ఉండే చేదు దీంట్లో మచ్చుకైనా ఉండదని.. దీనివల్లే బ్లాక్‌ఐవరీకి అద్వితీయమైన రుచి వస్తోందని తయారీదార్లు చెబుతున్నారు. ఏనుగు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు కాఫీగింజల్లో చేదుకు కారణమయ్యే ప్రోటీన్లను విడగొడుతుంటాయని, దీనివల్లే చేదు మాయమవుతుందని వారు పేర్కొన్నారు.

కామెంట్‌లు