ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

డీఎస్సీ తుది జాబితా విడుదల

విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: డీఎస్సీ-2012 తుది జాబితా ఆదివారం విడుదయ్యింది. విభాగాల వారీగా ఉద్యోగాలు కేటాయించి జాబితాను సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.కృష్ణవేణి తెలిపారు. స్థానిక, స్థానికేతర పోస్టుల విషయంలో 80:20 నిబంధనల ప్రకారం సుమారు 30 మందివరకు అభ్యర్థులను జాబితా నుంచి
తొలగించాల్సి వచ్చిందన్నారు. ఎంపికైనఅభ్యర్థుల జాబితాను అంతర్జాలంలో పొందుపరిచినట్లు చెప్పారు. sites.google.com/site/deovizag, sites.google.com/site/vizagbadi ద్వారా వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. కొందరు అభ్యర్థులు రెండు పోస్టులకు ఎంపిక కావడం, మరికొందరి ధ్రువపత్రాలు లేకపోవడంతో సుమారు 55 వరకు మిగులు పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఖాళీలు భర్తీచేయడానికి ప్రతిభ జాబితాలో కొత్తవారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈనెల 24న విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌లో ధ్రువపత్రాలు పరిశీలన చేపడుతున్నట్లు చెప్పారు. అభ్యర్థులు గైర్హాజరైతే ఎంపిక జాబితా నుంచి పేర్లు తొలగిస్తామన్నారు. ఈ నెల 26న మరోసారి జాబితా ప్రకటించి 27, 28న కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు.

సబ్జెక్టువారీ పోస్టుల వివరాలు
సబ్జెక్టు వారీగా మైదాన ప్రాంతంలో గల ఉపాధ్యాయ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయిలో గణితం-18, ఫిజిక్స్‌-18, బయాలజీ-9, సాంఘిక శాస్త్రం-6, తెలుగు-2, ఆంగ్లం-13, హిందీ-25. సెకండరీ గ్రేడ్‌ స్థాయిలో పీఈటీ-8, తెలుగు-13, హిందీ-24, ఎస్జీటీలు-269. ఏజెన్సీకి సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయిలో గణితం-1, హిందీ-3, ఫిజికల్‌ సైన్సు-4, బయాలజీ-3, సాంఘికశాస్త్రం-1. సెంకడరీ గ్రేడ్‌ స్థాయిలో హిందీ-3, తెలగు-2, పీఈటీ-1, ఎస్జీటీలు-196 పోస్టులు భర్తీచేయడానికి చర్యలు చేపడుతున్నట్లు డీఈవో తెలిపారు.

కామెంట్‌లు