ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఆచార్యుడి కామలీలలపై ఆందోళన

చర్యలకు ఏయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాల డిమాండ్‌
విశాఖపట్నం, చైతన్యవారధి: ఏయూ దూరవిద్య అర్థశాస్త్ర విభాగాచార్యుడు రామునాయుడిపై వర్సిటీ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఏయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. యువతితో శృంగార కార్యకలాపాలు సాగించినట్లు మీడియాలో కథనాలు వెలువడటం ఏయూలో కలకలం రేపింది.
దీంతో శుక్రవారం ఏయూ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ఉత్కంఠ వాతావరణం కనిపించింది. ఈ వ్యవహారాన్ని ఏయూ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా ఏయూ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు బొట్ట రామచందర్‌ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఏయూలో చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై వర్సిటీ వర్గాలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని సూచించారు. ఆచార్య రామునాయుడిపై అభియోగం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు టీఎన్‌ఎఫ్‌, ఎండీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు సైతం ఈ వ్యవహారంపై త్వరిత గతిన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఏయూలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

కామెంట్‌లు