ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జిఓననుసరించి తూర్పుకాపు ధ్రువపత్రాలు

అనకాపల్లి, డిసెంబరు 28(చైతన్యవారధి): ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి తూర్పు కాపులకు కుల ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తామని కలెక్టర్‌ వి.శేషాద్రి హామీ ఇచ్చారు. అనకాపల్లికి శుక్రవారం వచ్చిన ఆయనను స్థానిక మండల పరిషత్‌ కార్యాల యంలో తూర్పు కాపు సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
విశాఖజిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కలసి ఉన్నప్పుడు 1979లో జిఓ నెంబర్‌ను 73ను విడుదల చేస్తూ తూర్పుకాపులకు బిసి కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిందని సంఘం ప్రతినిధులు కోరుకొండ సాంబ శివరావు, పట్టణ తూర్పుకాపు సంఘం అధ్యక్షుడు పాండ్రంకి సత్యారావు తదితరులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కుట్రలో భాగంగా సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పరవాడ మండలాల్లో మినహా మిగిలిన మండలాల్లోని కాపులకు తూర్పుకాపు కుల ధ్రువపత్రాలను ఇవ్వనీయ కుండా కొంతమంది అడ్డుకున్నారని ఫిర్యాదుచేశారు. గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఈ విష యాలను తెలియచేయడంతో జిల్లాలో మిగిలిన మండలాల్లోని కాపులకు కూడా తూర్పుకాపు ధ్రువ పత్రాలివ్వాలని ఆదేశించారని తెలిపారు. దీన్ని కొన్ని కులాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ జిఓలను పరిశీలించి విశాఖజిల్లాలో అన్ని ప్రాంతాల్లోని కాపులకూ తూర్పుకాపు కుల ధ్రువీకరణ పత్రాలను అమలుచేయాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ, జిఓననుసరించి ఎవరికీ అన్యాయం జరగకుండా తూర్పుకాపులకు బిసి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తూర్పుకాపు సంఘం నాయకులు గొన్నాబత్తుల వెంకట రమణ, పలకా రాము, పలకా సత్యనారాయణ, తాడి రామకృష్ణ, నడిపల్లి గణేశ్వరరావు, కర్రి వెంకట సన్యాసినాయుడు, కాయల మురళీ, నిమ్మదల సన్యాసినాయుడు, ఉగ్గిన రమణమూర్తి పాల్గొన్నారు.

కామెంట్‌లు