ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంచనాకు మించి అధిక శిలామయ గ్రహాలు..

తాజా పరిశోధనల్లో వెల్లడి
శాంటియాగో: భూమి వంటి శిలామయ గ్రహాలు ఆవిర్భావానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను సవాల్‌ చేసే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌర కుటుంబంలో భూమి, బుధుడు, శుక్రుడు, అంగారకుడు రాతి గ్రహాలు. వాటి ఉపరితలంపై ఘన పదార్థం ఉంటుంది. కోర్‌ భాగంలో భారీ లోహాలు ఉంటాయి.
వాయువులతో కూడిన శని వంటి గ్రహాలకు అవి భిన్నం. లోగడ అంచనా వేసినదానికన్నా శిలామయ గ్రహాలు.. ఈ విశ్వంలో చాలా ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనం తేల్చింది.
'అల్మా' అనే అత్యాధునిక టెలిస్కోపును, ఉత్తర చిలీలోని ఎడారిలో ఉన్న 5వేల మీటర్ల ఎత్తయిన పర్వతంపై ఉంచి శాస్త్రవేత్తలు పరిశీలనలు జరిపారు. వీరు ఐఎస్‌ఓ-ఓపీహెచ్‌ 102 అనే గోధుమ రంగు మరుగుజ్జు నక్షత్రంపై దృష్టి నిలిపారు. ఒక తార చుట్టూ వలయంలా తిరుగుతున్న సూక్ష్మ పదార్థాలు పరస్పరం ఢీ కొట్టుకోవడం వల్ల శిలామయ గ్రహాలు ఏర్పడతాయని సంప్రదాయ సిద్ధాంతం సూచిస్తోంది. గోధుమ మరుగుజ్జు తారల వెలుపలి వలయాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయని ఇప్పటి వరకూ అంచనా వేశారు. అక్కడ వలయాలు చాలా పలుచగా ఉండటం వల్ల అందులోని రేణువులు పరస్పరం అతుక్కోవని భావించారు. పైగా రేణువులు చాలా వేగంగా కదులుతుండటం వల్ల అవి ఢీ కొట్టుకున్నా అతుక్కోలేవని లెక్కలు వేశారు.

అయితే ఐఎస్‌ఓ-ఓపీహెచ్‌ 102 తార చుట్టూ ఉన్న వలయంలో మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉన్న రేణువులను శాస్త్రవేత్తలు తాజాగా గమనించారు. ''గోధుమ మరుగుజ్జు తార చుట్టు ఉన్న వలయంలో అత్యంత శీతలంగా ఉండే వెలుపలి ప్రాంతాల్లో అంత పెద్ద పరిమాణంలో ఘన రేణువులు ఏర్పడటానికి వీల్లేదు. అక్కడ రాతి గ్రహం ఏర్పడే అవకాశం ఉందా? లేక ఇప్పటికే ఏర్పడిందా అన్నది మాకు స్పష్టంగా తెలియదు. అయితే ఆ దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. అంటే.. రాతి గ్రహాలు ఏర్పడటానికి సంబంధించిన మన సిద్ధాంతాలను మార్చుకోవాల్సి ఉంటుంది'' అని పరిశోధనకు నేతృత్వం వహించిన లూకా రిక్కి తెలిపారు.

కామెంట్‌లు