ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బిస్వాల్‌

హైదరాబాద్: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా చిత్తరంజన్‌ బిస్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కమిషన్‌ ప్రస్తుత ఛైర్మన్‌ రేచల్‌ ఛటర్జీ ఈ నెల 28న పదవీ విరమణ పొందనున్నారు. ఏపీపీఎస్సీ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్‌ ఎంపిక ఉత్కంఠ కలిగించింది. రేచల్‌ ఛటర్జీ స్థానంలో ఛైర్మన్‌ ఎంపిక కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ సహా పలువురు అధికారుల పేర్లను పరిశీలించారు. మిన్నీ మాథ్యూను సీఎస్‌గా కొనసాగించే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీకి మరొకరిని నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. మిన్నీ మాథ్యూ సైతం ఈ పోస్టుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఆమె మినహా ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలించాక చివరికి బిస్వాల్‌ వైపు మొగ్గుచూపారు. ఒడిశాకు చెందిన బిస్వాల్‌ 1981 బ్యాచ్‌ అధికారి. గత నెలాఖరులో పదవీ విరమణ పొందారు. రాష్ట్రంలో పలు శాఖల్లో పనిచేశారు. సాధారణ పరిపాలన శాఖ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎక్కువ కాలం విధులు నిర్వర్తించారు. పరిపాలన అనుభవాన్ని, రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని.. రాష్ట్రేతర అధికారి నియామకమే మేలన్న ఉద్దేశంతో బిస్వాల్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు