ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాల్సిందే

ఢిల్లీ ఘటనపై గళమెత్తిన మహిళాలోకం
ఆర్కేబీచ్‌లో భారీ ప్రదర్శనలు
విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: దేశ రాజధాని ఢిల్లీలో యువతిపై అత్యాచారం ఘటనను నగర మహిళాలోకం తీవ్రంగా ఖండించింది. సంఘటనను నిరసిస్తూ నగరంలోని పలు కళాశాలల విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల
ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేబీచ్‌లో భారీ ర్యాలీలు జరిగాయి. అవంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నగరంలోని పలు కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీ ఆర్కేబీచ్‌ వైఎంసీఏ నుంచి కాళీమాత ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ ఢిల్లీ ఘటన యావత్‌ భారతవని తలదించుకోవాల్సిన అంశమన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని ప్రభుత్వం శిక్షించకుండా ఉపేక్షించడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా నిందితులను ఉరి తీయాలన్నారు. బ్లూ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బీచ్‌లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రవితేజ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి తరుణ్‌ శ్రీరామ్‌, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌లు