ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పడిపోయిన సిమెంటు ధర...

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత నెల రోజుల వ్యవధిలో సిమెంటు ధర అనూహ్యంగా పడిపోయింది. ఇటీవలి కాలంలో పెరుగుతూ రావటం తప్పిస్తే, సిమెంటు ధర తగ్గటం అనేది అరుదుగా ఉంటోంది. తయారీదార్లు ఎంతగా కట్టుగా వ్యవహరించినప్పటికీ ధర పతనాన్ని ఆపలేకపోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలో
రాష్ట్రంలో బస్తా సిమెంటు ధర రూ.30 వరకూ పడిపోయింది. గిరాకీ లేకపోవడంతో డీలర్ల వద్ద సిమెంటు నిల్వలు అధికమై, కంపెనీల నుంచి వారు సిమెంటు తక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో బస్తా ధర రూ.260- 265 మాత్రమే పలుకుతోంది. నెల క్రితం వరకూ రూ.285- 295 వరకూ ఇక్కడ ధర పలికింది. డిమాండ్‌ పెరిగి, మళ్లీ మార్కెట్‌ కాస్త స్థిరపడితే తప్పించి రాష్ట్రంలో సిమెంటు ధర పెరగటం సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరోపక్క మన రాష్ట్రంలోని వాతావరణానికి భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో సిమెంటు ధర పెరుగుతోంది. ఇటీవలే ఎన్నికల ముగిసిన గుజరాత్‌లో తయారీదార్లు బస్తాకు రూ.15 వరకూ ధర పెంచారు. అభివృద్ధి పనులు ఇక ఇంకా వేగవంతం అవుతాయనే అంచనా దీనికి కారణమని అంటున్నారు. దేశవ్యాప్తంగా సిమెంటు వినియోగంలో గుజరాత్‌ వాటా 9 శాతం వరకూ ఉంటుంది. అంతేగాక గుజరాత్‌ నుంచి ఎగుమతులు అధికం. మధ్యప్రాచ్య దేశాలకు ఈ రాష్ట్రం నుంచి సిమెంటు అధికంగా ఎగుమతి అవుతోంది. అంబుజా, అల్ట్రాటెక్‌, జేకే లక్ష్మీ, శ్రీ సిమెంటు, జేపీ తదితర కంపెనీలు గుజరాత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇదేవిధంగా కేరళలోనూ బస్తాకు రూ.10 చొప్పున ధర పెరిగినట్లు సిమెంటు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కేరళకు మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి సిమెంటు సరఫరా అవుతుంది. విద్యుత్తు ఛార్జీలు, ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కేరళలో విక్రయించే సిమెంటు ధరను ఆయా కంపెనీలు రూ.10 మేరకు పెంచినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. దీంతో కేరళలో సిమెంటు బస్తా ధర రూ.300కు చేరింది. ఈ కోవలోనే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ధర పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

రాష్ట్రంలో సిమెంటు ధరపై ఒత్తిడి ఉండటానికి ఇటీవల కాలంలో ఇక్కడ కొత్త కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించటం ప్రధాన కారణమని తెలుస్తోంది. జేపీ అసోసియేట్స్‌ జగ్గయ్యపేట వద్ద నెలకొల్పిన కొత్త యూనిట్‌ నుంచి సిమెంటు తయారు చేసి మార్కెట్‌కు అందిస్తోంది. అదేవిధంగా నంద్యాల సమీపంలో జేఎస్‌డబ్ల్యూ కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తయింది. దీంతో అక్కడి నుంచి కూడా సిమెంటు మార్కెట్లోకి వస్తోంది. జయజ్యోతి సిమెంటు కంపెనీ నుంచి రాష్ట్ర మార్కెట్‌కు సరఫరా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో రాష్ట్రంలో డిమాండ్‌ పెద్దగా పెరగ లేదు. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు రంగంలో పెద్దగా ప్రాజెక్టులు రాకపోవడం, నిర్మాణంలో ఉన్న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి వంటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో డిమాండ్‌లో ఆశించినంత వృద్ది లేదని సంబంధిత వర్గాలు వివరించాయి. దీంతో ఇక కొత్త సంవత్సరంపైనే ఇక్కడి పరిశ్రమ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

కామెంట్‌లు