ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం

కాంట్రాక్టు కార్మికుడి దుర్మరణం
పరవాడ, చైతన్యవారధి: సింహాద్రి జాతీయ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం (ఎన్టీపీసీ) రెండో దశ విస్తరణ పనులు చేపడుతున్న ీసునీల్‌ హైటెక్‌' కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంలో బీహర్‌ రాష్ట్రానికి చెందిన కార్మికుడు
ముబారక్‌ అన్సారీ (30) మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీహర్‌లోని భుతాని గ్రామానికి చెందిన అన్సారీ కొత్త వెన్నెలపాలెంలో నివసిస్తూ, కొన్నేళ్లుగా సునీల్‌ హైటెక్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లిన అన్సారీ నాలుగో యూనిట్‌ లిఫ్ట్‌కు చెందిన వెల్డింగ్‌ పనులు 60 మీటర్ల ఎత్తులో చేస్తుండగా కాలు జారడంతో సేఫ్టీ బెల్టు తెగిపోయి కిందపడ్డాడు. తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అన్సారీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే కార్మికులు మృత్యువాత పడుతున్నారని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాత్రి 7 గంటలకు కేజీహెచ్‌ వద్ద సునీల్‌ హైటెక్‌ కంపెనీ ప్రతినిధి వెంకటేశ్వరరావుతో కార్మిక సంఘం నేతలు రామయ్యనాయుడు, సింహాద్రి హెచ్‌.ఆర్‌ అధికారులు డి.ఎస్‌.కుమార్‌, కిషోర్‌ చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం కింద రూ. 6.25 లక్షలు, దహన సంస్కార నిమిత్తం రూ. 50 వేలు చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు