ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల మెస్‌ ఛార్జీల పెంపు

శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన
హైదరాబాద్‌: సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల మెస్‌ఛార్జీలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌ ఆదివారం శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలతోపాటు గ్యాస్‌ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వసతిగృహాల్లో ఉన్న దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు వూరటనిచ్చింది.
వసతిగృహాలకు మెస్‌ఛార్జీలు పెంచడంతోపాటు, పౌర సరఫరాల శాఖ ద్వారా ఇచ్చే బియ్యం ధరను కూడా కిలోకి రూ.4 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పెంపుదల ప్రభుత్వ హాస్టళ్ళ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలకు చట్టబద్ధత కల్పించడానికి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాల్లో 3 నుంచి 7 వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం అమలవుతున్న మెస్‌ ఛార్జీలతో పోలిస్తే 63.34 శాతం, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దాదాపు 62.94 శాతం పెంచింది. అలానే కళాశాల విద్యార్థులకు మెస్‌ఛార్జీ కింద నెలకు రూ.520 నుంచి రూ.1050 పెంచి అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. పెరిగిన మెస్‌ఛార్జీలు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని చెప్పారు. 2008లో చివరిసారిగా మెస్‌ఛార్జీలు పెరిగాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి. భుత్వ నిర్ణయంతో పాఠశాల స్థాయి(ప్రీ మెట్రిక్‌) వసతిగృహాల విద్యార్థులకు భారీగా వూరట లభించనుంది. మెస్‌ఛార్జీ పెరగడంతోపాటు బియ్యం ధర తగ్గించడంతో కూరగాయలు, పాలు, గుడ్డు, పండ్లు, స్నాక్స్‌పై ఎక్కువ ఖర్చు చేసి కొంత నాణ్యమైన ఆహారం అందించడానికి వీలువుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో ఒక్కో విద్యార్థికి అమలయ్యే మెస్‌ఛార్జీలు(నెలకు) ఇలా ఉన్నాయి...

తరగతి ప్రస్తుతం పెంచినది
3 నుంచి 7 రూ.475 రూ.750
8 నుంచి 10 రూ.535 రూ.850

కళాశాల విద్యార్థులకు రూ.1050
ప్రస్తుతం బీసీ, వికలాంగ విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే మెస్‌ఛార్జీలలో వ్యత్యాసం ఉంది. అలానే ఇంటర్‌ నుంచి పీజీ, వృత్తి విద్యాకోర్సులు చదివే విద్యార్థులకు ఇచ్చే మెస్‌ఛార్జీలు భిన్నంగా ఉన్నాయి. కోర్సు, వర్గాన్ని బట్టి ఒక్కో విద్యార్థికి ప్రస్తుతం నెలకు రూ.320 నుంచి మొదలుకొని రూ.1200 వరకు మెస్‌ఛార్జీగా వస్తోంది. ఇన్ని వైరుధ్యాలు ఉండటం వలన ఒకే వసతిగృహంలో, ఒకే కోర్సులో ఉండే విద్యార్థుల మధ్య విభేదాలు, గందరగోళాలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇంటర్‌ నుంచి పీజీ వరకు నెలకు ఇచ్చే మెస్‌ఛార్జీ రూ.520 నుంచి రూ.1050కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. దీని ప్రకారం కోర్సులు, వర్గంతో సంబంధం లేకుండా అందరికీ ఉమ్మడిగా ఒకే రకమైన మెస్‌ఛార్జీ అమల్లోకి వస్తుంది. ఒకే రకమైన మెస్‌ఛార్జీ అమలుచేయడం ఉత్తమంగా ఉంటుందని వార్డెన్లు కూడా చెబుతున్నారు. వృత్తి విద్య చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1200 మెస్‌ఛార్జీ, ప్రభుత్వ నిర్ణయం వలన రూ.150 తగ్గిపోయే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయంలో స్పష్టత లేదు. విద్యార్థి యాజమాన్య వసతి గృహాల మెస్‌ఛార్జీలు మాత్రం పెరగలేదు. కేవలం ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రమే దీన్ని వర్తింపచేసి విద్యార్థి యాజమాన్య హాస్టళ్లను విస్మరించడంపై విమర్ళలు వ్యక్తమవుతున్నాయి.

శాస్త్రీయత లేదు: బీసీ, విద్యార్థి సంఘాలు
మెస్‌ఛార్జీల పెంపుదల విద్యార్థుల విజయమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. పెంపుదలలో శాస్త్రీయత లేదని విద్యార్థుల మద్య వివక్ష చూపడం తగదని అందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మెస్‌ఛార్జీలతో పాటు కాస్మొటిక్‌ ఛార్జీలను పెంచాలని కృష్ణయ్య కోరారు. ప్రస్తుత ధరలతో ప్రభుత్వం పెంచిన మెస్‌ఛార్జీలు ఏమాత్రం సరిపోవని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) అధ్యక్ష, కార్యదర్శులు నూర్‌మహమ్మద్‌, పి.లక్ష్మయ్య పేర్కొన్నారు. విద్యార్థికి 2200 కేలరీల శక్తి అందించాలనీ, ప్రభుత్వం ప్రకటించిన మెస్‌ఛార్జీలతో 1200 కేలరీల ఆహారం మాత్రమే సాధ్యమవుతుందని ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.


కామెంట్‌లు