ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

విశాఖపట్నం(రూరల్): మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైన గురువారం రోజున భక్తులు దర్శనాలకు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు అమ్మవారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం
దేవస్థానం విశేష పంచామృతాభిషేక సేవ నిర్వహించింది. 90 నిమిషాల పాటు పూజాధికాలు ఆలయ ఆవరణలో సాగాయి. ఆలయ ఈవో డి.భ్రమరాంబ దంపతులతో పాటు టిక్కెట్టు తీసుకున్న 8మంది ఉభయ దాతలు విశేష పూజలకు హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల నుంచి భక్తులకు అమ్మవారిని దర్శించుకొనే అవకాశం కల్పించారు. అప్పటికే భక్తులు బారులు దీరారు. టౌన్‌ కొత్తరోడ్డు నుంచి ఆలయం వరకు క్యూలైన్‌ కనిపించింది. తొలివారం కావడంతో భక్తులకు పెద్ద ఇబ్బందలేవీ ఎదురలేదు. అర్ధరాత్రి నుంచి దర్శనాలు లభించడం, పోలీసులు, దేవాదాయ శాఖ సిబ్బంది తగు ఏర్పాట్లు చేయడం వల్ల సాఫీగా దర్శనాలు సాగాయి. మధ్యాహ్న విరామం లేకుండా సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు కల్పించారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి రద్దీ తగ్గింది. మళ్లీ సాయంత్రం రెండు గంటల సేపు ప్రత్యేక పంచామృతాభిషేక సేవ కోసం దర్శనాలను నిలిపివేశారు. ఆ సమయంలో రద్దీ ఒక్కసారి పెరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. మొత్తం మూడు బస్సు సర్వీసులను నడిపారు. మధురవాడ, అగనంపూడి, పెందుర్తి నుంచి ఇవి తిరిగాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఉచిత బస్సు సర్వీసులను నడిపారు. ఆటో సుందర్‌ మహిళలకు ఉచితంగా ఆటోల్లో తీసుకొచ్చారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేయడం వల్ల వీరంతా సులవుగానే అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు, ఆదాయపన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ సుశీల్‌కుమార్‌ పాండే దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వీరికి అధికారులు స్వాగతం పలికారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కామెంట్‌లు