ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

601 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన

వచ్చే నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మేలో పరీక్షలు
 హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని 601 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ (ఏపీపీఎస్సీ) ఎట్టకేలకు శనివారం ప్రకటన (నోటిఫికేషన్‌) జారీ చేసింది. సీఆర్‌ బిస్వాల్‌ సంఘం నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు
స్వీకరించిన అనంతరం వెలువడిన మొట్టమొదటి ప్రకటన ఇదే. వచ్చే నెల నుంచి దరఖాస్తులను స్వీకరించి మేలో పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
* రవాణా సబార్డినేటు సర్వీసులో 64 సహాయ మోటారు వాహన ఇన్‌స్పెక్టరు పోస్టులకు వచ్చే నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు మే 26న జరుగుతాయి.
* కళాశాల విద్యాశాఖలో 12 మంది వ్యాయామ సంచాలకులు, 21 మంది గ్రంథపాలకుల పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. మే అయిదో తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
* గ్రామీణ నీటిసరఫరా శాఖ సబార్డినేటు సర్వీసులో 362 సహాయ ఇంజినీర్‌ పోస్టులకు వచ్చే నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మే 26న పరీక్ష నిర్వహిస్తారు.
* స్త్రీశిశు సంక్షేమ శాఖలో 107 సీడీపీవో పోస్టులకు వచ్చే నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే అయిదో తేదీన పరీక్ష జరుపుతారు.
* ఇంజినీరింగు శాఖలోని సహాయ పరిశోధన అధికారి పోస్టులు 6, పరిశోధక సహాయకుడి పోస్టులు 17, ఇంజినీరింగేతర విభాగంలో మరో పరిశోధక సహాయకుని పోస్టులకు వచ్చే ఫిబ్రవరి అయిదో తేదీ నుంచి మార్చినాలుగో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి మే నెల 5,9,5 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగు శాఖలో 10 పరిశీలక పోస్టులు, ఇంజినీరింగేతర విభాగంలో ఒక పోస్టులు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి మే 23, 26 తేదీల్లో పరీక్షలు జరుపుతారు.
వాహన ఇన్‌స్పెక్టరు పోస్టులకు 21 నుంచి 34 ఏళ్ల వయోపరిమితిని నిర్దేశించారు. మిగిలిన పోస్టులకు 18 నుంచి 34 ఏళ్ల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి కోరారు.


కామెంట్‌లు