ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అత్యాచార నిందితులకు 30 ఏళ్ల జైలు

-కాంగ్రెస్‌ ముసాయిదా బిల్లు
న్యూఢిల్లీ: అత్యాచార ఘటనల్లో నిందితులకు 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించింది. అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు రసాయన ప్రక్రియ ద్వారా వారిలో లైంగిక కాంక్షను.. విపరీతమైన లైంగిక ప్రవృత్తిని సమూలంగా నాశనం చేయాలని గట్టిగా కోరింది. రసాయనిక సూది మందుతో వంధ్యత్వం
కలగకపోయినప్పటికీ దీని ప్రభావం వల్ల లైంగికపరమైన కోరికలు ఉత్పన్నమయ్యే ప్రసక్తే ఉండదు. ఈ మేరకు అంశాలను పొందుపరుస్తూ అత్యాచార నిరోధక ముసాయిదా బిల్లును రూపొందిస్తోంది. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్‌ వర్మ కమిటీకి ముసాయిదాను సమర్పించనుంది. అయితే తమ ముసాయిదా ప్రతి ఇంకా పూర్తికాలేదని కాంగ్రెస్‌ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో సూచించింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నిందితుల్ని శిక్షించాలని పేర్కొంది. అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేసిన సమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారితో చర్చించారు. ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానాల ఏర్పాటుకు ఆమె సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరీ మాట్లాడుతూ.. నిందితులకు రసాయనిక ప్రక్రియ ద్వారా వారిలో లైంగిక కాంక్షను.. లైంగికపరమైన రాక్షస ప్రవృత్తిని సమూలంగా నాశనం చేయాలని సూచించారు. పలు దేశాల్లో ఇది అమలవుతోందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ రూపొందిస్తున్న ముసాయిదాలో ఈ అంశాలను పొందుపరిచారు. బాలనేరస్థులకు సంబంధించిన చట్టంలోనూ మార్పులు చేయాలని సూచనలు వచ్చాయి. ఢిల్లీ అత్యాచార ఘటనలో 18 ఏళ్లలోపు వయస్సున బాలుడు.. బాధితురాలి పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్లలోపు వారిని మాత్రమే బాలనేరస్థులుగా పరిగణించాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దేశంలో సమాచార హక్కు చట్టం లాంటి చరిత్రాత్మకమైన చట్టాలను సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రూపొందించింది. తాజాగా అత్యాచార నిరోధక ముసాయిదా రూపకల్పనలోనూ వారు పాలుపంచుకునే అవకాశం ఉంది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీర్థ్‌ నేతృత్వంలో శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో వ్యక్తమైన సూచనలకు సమగ్ర రూపమిచ్చి జస్టిస్‌ వర్మ కమిటీకి సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ''ఇప్పటి వరకు ప్రభుత్వ ముసాయిదా పత్రం లేదు. త్వరలో జస్టిస్‌ వర్మ కమిటీకి అందజేసే నివేదికే తొలి లఖితపూర్వక పత్రం అవుతుంది. దానిపైనే కొత్త చట్టం రూపకల్పన ఆధారపడుతుంది'' అని వివరించాయి.

కామెంట్‌లు