ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

280 కోట్ల ఏళ్ల నాటి వాతావరణంపై పరిశోధన

లండన్‌: కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద వాతావరణం ఎలా ఉండేది? ఇప్పుడు ప్రాణవాయువుగా ఉన్న ఆక్సిజన్‌ అప్పుడు కూడా ఉండేదా?.. ఇటువంటి ఆసక్తికర ప్రశ్నలకు అమెరికా శాస్త్రవేత్తలు సమాధానం కనుగొనే ప్రయత్నం చేశారు. దక్షిణాఫ్రికాలో 1980లలో దొరికిన కొన్ని శిలాజాలపై వారు పరిశోధనలు జరిపారు.
బూడిదలాంటి ఉపరితలంపై వర్షపు చినుకులు పడినప్పుడు ఏర్పడిన గుంటలతో ఈ శిలాజం రూపొందింది. ఇది 270 కోట్ల ఏళ్ల నాటిది. శిలాజంపైన ఉన్న గుంటల విస్తీర్ణాన్ని లెక్కించటం ద్వారా.. ఎంత వేగంతో వర్షపు చినుకులు వాటిపై పడ్డాయన్నది శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తద్వారా నాటి ప్రాచీనకాలంలో భూమ్మీద గాలి సాంద్రత ఎలా ఉండేదన్నది కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త సంజోయ్‌ సోమ్‌ మాట్లాడుతూ.. 'అప్పట్లో భూమ్మీద ఆక్సిజన్‌ లేదు. నైట్రోజన్‌ మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగానే నాటి వాతావరణంలోనూ కొంతమేరకు ఉండేది. కార్బన్‌డయాక్సైడ్‌, మీథేన్‌ వంటివి చాలా ఎక్కువ మోతాదులో ఉండేవి. ఇదంతా ఒక ప్రతిపాదన మాత్రమేగానీ.. కచ్చితమైన అంచనా కాదు' అని చెప్పారు. శిలాజం నుంచి మరిన్ని వివరాలు రాబట్టటానికి సంజోయ్‌ బృందం పరిశోధనలు జరుపుతోంది.

కామెంట్‌లు