ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

19 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు

విశాఖపట్నం, చైతన్యవారధి: జీవీఎంసీ పాఠశాలల్లోపనిచేస్తున్న ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతుల కౌన్సిలింగ్‌గురువారం జీవీఎంసీలో నిర్వహించారు. 31 మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉండగా 19 మంది అర్హులుగా పేర్కొంటూ పదోన్నతి కల్పించారు. ఇంకా 12 పోస్టులు మిగిలిపోయాయి. పదోన్నతుల జాబితా
తయారుచేసినా తమకు తెలియజేయలేదని, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కౌన్సిలింగ్‌ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. తుది జాబితా తమకుఇవ్వలేదని, కౌన్సిలింగ్‌ సమాచారం కూడా గోప్యం ఉంచాల్సిన పరిస్థితిఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదోన్నతులు కల్పిస్తున్నవారికి మాత్రమే సమాచారం ఇచ్చారని, అర్హుల జాబితా ఉన్న మిగతావారికి సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. అదనపు కమిషనర్‌ (ఫైనాన్స్‌) పూర్ణచంద్రరావు సర్థిచెప్పి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఆంగ్లంకు సంబంధించి 9 మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉండగా ఎనిమిది మంది మాత్రమే అర్హులు ఉండడంతో ఒకపోస్టును విడిచిపెట్టారు. గణితంలో 9 పోస్టులకు ఇద్దరే అర్హులుండడంతో మిగతా ఏడు పోస్టులను పక్కనపెట్టారు. భౌతికశాస్త్రం నాల్గింటికి ఒక్కరూ అర్హులు లేకపోవడంతో ఆ సబ్జెక్టులో పదోన్నతి కల్పించలేదు. జీవశాస్త్రం 1, సాంఘికశాస్త్రం 4, తెలుగు పండిట్‌లు4 పోస్టులకు అర్హులుండడంతో వాటికి ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించారు. కౌన్సిలింగ్‌లో జీవీఎంసీ వ్యయ పరిశీలకులు జి.సత్యనారాయణ, ఉప విద్యాశాఖాధికారి లక్ష్మీనర్స, పాఠశాలల పర్యవేక్షకురాలు విమలకుమారి, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు