ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మునిసిపాలిటీలలో ఉపాధ్యాయుల నియామకంపై గందరగోళం

విశాఖపట్నం: డీఎస్సీ 2012 ద్వారా మునిసిపాలిటీలలో ఉపాధ్యాయుల నియామకంపై గందరగోళం నెలకొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలకు భిన్నంగా పోస్టులు కావాలంటూ మునిసిపల్ అధికారులు కొత్త లెక్కలు చెబుతుండడంతో విద్యాశాఖ తలలు పట్టుకుంది. నోటిఫికేషన్‌లో మునిసిపాలిటీలకు 1170 పోస్టులు ప్రతిపాదించిన ఉన్నతాధికారులు వాటి వివరాలు పేర్కొనకపోవడంతో ఇప్పుడు సమస్య వచ్చిపడింది.
డీఎస్సీ 2012 రాత పరీక్ష ఫలితాలను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే నెల ఒకటిన ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల చేస్తారు. పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్ల మేరకు జాబితా ఖరారుచేస్తారు. జిల్లా విద్యాశాఖ పరిధిలో మైదానం, ఏజెన్సీలో పోస్టుల మేరకు జాబితా రూపొందించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే జీవీఎంసీ, భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీలలో వున్న ఖాళీలను తొలుత 38గానే నోటిఫికేషన్‌లో చూపించారు. దీని ప్రకారం రోస్టర్ పాయింట్లు రూపొందించే సమయంలో జీవీఎంసీ, రెండు మునిసిపాలిటీల అధికారులు కొత్త ప్రతిపాదనలు తెచ్చారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా 38 కాదని, వందకుపైగా ఖాళీలున్నాయని ఇప్పుడు ప్రతిపాదనలు ఇవ్వడంతో జిల్లా విద్యాశాఖాధికారులు కంగుతిన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా ఖాళీలు చూపించి పోస్టులు కావాలంటే ఎలా అన్న ప్రశ్న రావడంతో హైదరాబాద్‌లో ఉన్నతాధికారులను సంప్రదించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు అదనంగా నియామకాలు చేపడితే న్యాయపరంగా చిక్కులు తలెత్తే అవకాశం వుందని సందేహాలు వ్యక్తంచేశారు. అయితే 2012 నోటిఫికేషన్‌లో పేర్కొన్న మరో అంశాన్ని మునిసిపాలిటీ ఉన్నతాధికారులు ప్రస్తావించడంతో విద్యాశాఖాధికారులు కంగుతినాల్సి వచ్చింది. రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలలో కలిపి 1170 ఖాళీలను చూపించారు తప్ప వాటి వివరాలు లేకపోవడంతో ఏ కేటగిరీలో ఎన్ని నియామకాలు చేపట్టాలన్న సందేహాలు వ్యక్తంచేశారు. దీనిపై కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం వుందని విద్యాశాఖాధికార వర్గాలు వెల్లడించాయి.


కామెంట్‌లు