ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పదో తరగతి బాలికను రేప్ చేసిన హెడ్ మాస్టర్

 భువనేశ్వర్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలికను ప్రధానోపాధ్యుడే రేప్ చేశాడు. ఒడిషాలోని కలహండి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన అంపాని సేవాశ్రమ్ పాఠశాల హెడ్ మాస్టర్ నకుల్ సబార్‌ను ఉన్నతాధికారుల అనుమతితో సస్పెండ్ చేశారు.... ఈ విషయాన్ని జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎస్‌కె మొహమ్మద్ చెప్పారు.
వివరాలు ఇలా ఉన్నాయి... ఎస్‌టి బాలికల హాస్టల్ వద్ద ఉన్న తన గదికి నవంబర్ 22వ తేదీన హెడ్ మాస్టర్ బాలికను పిలిపించాడు. దాంతో ఆమె వచ్చింది. ఆ బాలికపై బలవంతంగా అతను అత్యాచారం చేశాడు. విషయాన్ని ఆ తర్వాత తోటి బాలికలకు ఆమె చెప్పింది.
సేవాశ్రమ్ ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంచి, బాలికలను బయటకు వెళ్లనీయరు. దీంతో బాలికలు ఏమీ చేయలేకపోయారు. గ్రామస్థులకు ఈ సంఘటన గురించి మొన్న తెలిసింది. పాఠశాల వద్ద వారు ధర్నా చేసారు. హెడ్ మాస్టర్‌ను గ్రామస్థులు చితక బాదారు.

సంఘటనను నిరసిస్తూ గ్రామస్థులు 201 జాతీయ రహదారిపై బైఠాయించారు. దాంతో పోలీసులు హెడ్‌ మాస్టర్‌ను అరెస్టు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడిని బాలికల హాస్టల్ ఆవరణలో ఉండనీయడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు అధికార వర్గాలపై దాడికి పూనుకున్నారు.

కామెంట్‌లు