ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఇద్దరు మంత్రుల కొడుకులపై యువజన కాంగ్రెస్ వేటు

వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తనయులపై వేటు పడింది. మంత్రుల తనయులను యూత్ కాంగ్రెసు నుంచి బహిష్కరించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తనయుడు బస్వరాజు శ్రీమాన్, కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ తనయుడు పోరిక సాయి శంకర్‌లను యువజన కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ లిజ్జు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీమాన్, సాయి శంకర్‌లను సమావేశాలకు సరిగా హాజరు కాకపోవడం, కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం తదితర కారణాలతో బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ వారి చర్యలపై సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు. శ్రీమాన్ వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానానికి, సాయి శంకర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి యూత్ కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
వీరు గత జూలైలో ఎన్నికయ్యారు. నాలుగు నెలలుగా వారు శిక్షణా కార్యక్రమాలకు, మెంబర్ షిప్ కార్యక్రమాలకు, ప్రభుత్వం కార్యక్రమాల అవగాహన కార్యక్రమాలకు, రివ్యూ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లిజ్జు నోటీసులకు కూడా వారు స్పందించలేదని అందుకే బహిష్కరించినట్లుగా చెప్పారు.
అయితే.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను వ్యక్తిగతంగా కలిస్తేనే యువజన కాంగ్రెస్‌కు సేవలు అందిస్తున్నట్లుగా.. స్వతంత్రంగా వ్యవహరిస్తే నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారని సస్పెన్షన్‌కు గురైన వారి వర్గం ఆరోపిస్తోంది.
గతంలో ఆయన పార్టీని వీడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన సంగతిని ఎవరూ విస్మరించలేదని, రిలయన్స్‌పై దాడుల వ్యవహారాన్ని ఎవరూ మరిచిపోలేదని దీనిని యువజన కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని వారంటున్నారు.

కామెంట్‌లు