ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్ భేటీ

న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్వాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి ఆయన శనివారం సోనియా గాంధీని కలిశారు. తనకు నాలుగు పదవుల్లో ఏదైనా ఒక్కటి ఇవ్వాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.నాయకత్వ మార్పు చేస్తే ముఖ్యమంత్రి పదవి గానీ, పిసిసి అధ్యక్ష పదవి ...

గానీ తనకు ఇవ్వాలని డిఎస్ అడిగినట్లు చెబుతున్నారు. లేదంటే, పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో స్థానం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఇందులో సీనియర్ నేత జి. వెంకటస్వామి, కె. కేశవరావు ఉండేవారు. వారి స్థానంలో తనను తీసుకోవాలని ఆయన సోనియాను కోరినట్లు చెబుతున్నారు. ఇకపోతే, తెలంగాణ సమస్య పరిష్కారానికి త్వరలో ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేస్తారనే మాట వినిపిస్తోంది. అటువంటి బోర్డు ఏర్పాటు చేస్తే దానికి చైర్మన్‌గా తనను నియమించే విషయాన్ని పరిశీలించాలని డిఎస్ సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. చట్టబద్దతతో కూడిన తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రలపై డిఎస్ సోనియాకు వివరించినట్లు చెబుతున్నారు. అలాగే, వైయస్ జగన్ జైలులో ఉన్నప్పటికీ జరుగుతున్న వలసలపై ఆయన సోనియాకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటన చేయకపోతే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తెరాసలో చేరుతారనే ఊహాగానాలపై ఆయన సోనియాతో చర్చించినట్లు చెబుతున్నారు. మొత్తంగా, రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఆయన సోనియాకు వివరించినట్లు సమాచారం.

కామెంట్‌లు