ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాష్ట్రానికి మళ్ళీ కేంద్ర బలగాలు

హైదరాబాద్‌: తాత్కాలికంగా సద్దుమణిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ ఉద్ధృతమయ్యే సూచనల నేపథ్యంలో రాష్ట్రానికి మళ్లీ కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు. ఇప్పటికే 20 కంపెనీలు రాజధానికి చేరుకోగా రాబోయే రోజుల్లో మరో 30 కంపెనీలు చేరుకుంటాయని భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన...
తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంలో ముందు జాగ్రత్తగా గత డిసెంబరు నెలలోనే పెద్దఎత్తున కేంద్ర బలగాలను రప్పించారు. దాదాపు వంద కంపెనీలకు పైగా బలగాలు బందోబస్తు విధులు నిర్వర్తించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి కేంద్రం తన బలగాలను వెనుక్కు పిలిపించింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావస్తున్నందున కేంద్ర బలగాలకు వెసులుబాటు కలిగింది. ఇదే సయయంలో మే తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతమవుతుందని కొన్ని రాజకీయ పక్షాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. దాంతో ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను పంపాలంటూ రాష్ట్ర పోలీసుశాఖ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తొలి విడతగా 20 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్ర రాజధానికి చేరుకున్నాయి. సోమవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిరోజుల్లో మరో 30 కంపెనీల బలగాలు రానున్నాయి. వీటన్నింటినీ ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉంచి ఆ తర్వాత అవసరాలను బట్టి ఇతర ప్రాంతాలకు పంపాలని అధికారులు భావిస్తున్నారు.

కామెంట్‌లు