ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రైతులను అన్నివిధాలా ఆదుకోవడానికి చర్యలు

- మంత్రి బాలరాజు
బుచ్చెయ్యపేట, చైతన్యవారధి : భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకోవడానికి చర్యలు చేపట్టామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మాది రైతు ప్రభుత్వం. రైతుల సంక్షేమమే మా ధ్యేయం. వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం' అని
అన్నారు. జిల్లాలో జల్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని మండలంలోని పొట్టిదొరపాలెంలో మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ముందుగా ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, తర్వాత వీటిని 12కి పెంచినట్లు వివరించారు. అవసరమైతే అద్దెకి భవనాలు తీసుకుని ధాన్యం నిల్వచేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రబీలో సాగుచేసుకోవడానికి 63 క్వింటాళ్ల నువ్వు విత్తనాలను అవసరమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అవసరమైన విత్తనాలను అందించడానికి ఆయన అంగీకరించారని చెప్పారు. జిల్లాకి రావాల్సిన రూ. 3.70 కోట్ల కరవు సాయాన్ని కూడా వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ అన్ని సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదని, ధైర్యంగా ఉండి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. 1.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఏజెన్సీలో కూడా రాజ్‌మాచిక్కుళ్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తామన్నారు. చోడవరం ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ నిబంధనలు సాకుగా చూపించి పాడైన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తిప్పి పంపిస్తున్నారని విమర్శించారు. ఎకరానికి రూ. 10 వేల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.రావికమతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదనపు జాయింట్‌ కలెక్టరు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు 19 వేల హెక్టార్లు, డిసెంబరులో కురిసిన వర్షాలకు 30 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఎమ్పీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొండా రాంబాబు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొండా అచ్చియ్యదొర, సర్పంచి గండెం రాజు, సతీష్‌వర్మ, అల్లు భానుమతి, కోవెల జనార్థనరావు, గేదెల సత్యనారాయణఅధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు