ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే ఓదార్పు

విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే మాజీ ఎంపీ జగన్‌ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో నగర తెదేపా అధ్యక్షుడు పీలా శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లెక్కలేనని కుంభకోణాలు జరిగాయన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయ్యిందని పేర్కొన్నారు. జగన్‌ ఎంపీగా ఉన్నపుడు అయిదుసార్లు పెట్రోలు ధరలు పెరిగాయని అప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు ధరలు పెరగగానే జనదీక్ష అంటూ
నిరసన చేయడం ఏంటని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకాన్ని వై.ఎస్‌.దిగా చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, జగన్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సంపాదించిన అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే దీక్షలంటూ జగన్‌ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో 12 సార్లు పెట్రోల్‌ ధరలు పెరిగినా ఈయనకు ఏమీ కనిపించలేదని ఎద్దేవా చేశారు. తీరంలో జగన్‌ దీక్ష చేస్తే సముద్రం మొత్తం అవినీతితో కలుషిత మైపోతుందన్నారు.

కామెంట్‌లు