ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలినగర్‌ మార్కెట్‌ సమీపంలోని మలుపు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తాపీ మేస్త్రి మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రయాణికులతో ఓ ఆటో వాడచీపురుపల్లి విస్సన్నపేట వెళ్తోంది.
అదే సమయంలో రాజన్నపాలెం నుంచి గాజువాక వస్తున్న వ్యాన్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న కూండ్రపు ఎరుకునాయుడు (43), పైల అప్పారావు(45)తో పాటు డ్రైవర్‌ మేడిశెట్టి నూకరాజు(38)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరవాడ పీహెచ్‌సీకు తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఎరుకునాయుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు.పైలా అప్పారావు, మెడిశెట్టి నూకరాజులను చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారు విస్సన్నపేటకు చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తాపీమేస్త్రీగా బతుకు వెళ్లదీస్తున్న ఎరుకునాయుడు మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. పరవాడ ఎస్సై పైడపునాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు