ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సాక్షి పై తెలుగు తమ్ముళ్ల వార్

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి దీక్షపై సందేహాలు వ్యక్తం చేస్తూ వైయస్ జగన్ సాక్షి టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనంపై తెలుగుదేశం వర్గాలు భగ్గుమంటున్నాయి. వైయస్ జగన్ పై తెలుగు తమ్ముళ్లు నిప్పులు కక్కుతున్నారు. ప్రభుత్వం, తెలుగుదేశం కుమ్మక్కయి ...
చంద్రబాబు దీక్షను కొనసాగిస్తున్నారని సాక్షి టీవీ చానెల్ ఆరోపించింది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పార్టీ గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి నిరాహార దీక్ష డ్రామా అని సాక్షి కథనం ప్రచురించడంపై వారు మండిపడ్డారు. నిమ్స్ ముందు వారు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడారు. సాక్షిలో వచ్చే కథనాలలో నిజాలు ఉండవన్నారు. అన్నీ అబద్దాలు ప్రచురిస్తారన్నారు. సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ అయిన వైయస్ జగన్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాలో సాక్షి కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వైయస్ ఫోటో పెట్టుకొని జగన్ చేస్తున్న దీక్షకు అర్థం లేదన్నారు. సాక్షి మాటలు ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరన్నారు. కోట్లాది రూపాయల అక్రమ సంపాదనతో పెట్టిన సాక్షి గురించి అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ కు సంబంధించిన సాక్షికి లేదన్నారు. సాక్షి తప్పుడు వార్తలు మానుకొని సరియైన సమాచారం ప్రజలకు ఇస్తే బావుంటుందని సూచించారు. వైయస్ జగన్ 48గంటల దీక్షను హైలెట్ చేయడానికి రైతుల సమస్యల కోసం 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బాబును విమర్షించటం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అందుకే ఆయన స్పందించారన్నారు. రైతుల కోసం దీక్ష అంటున్న జగన్ కు ప్రతిపక్ష చంద్రబాబు దీక్ష దొంగ దీక్షగా కనిపించటం సరికాదన్నారు. సాక్షి వ్యాఖ్యలు కేవలం చంద్రబాబుని అవమానించినట్టు కాదని రాష్ట్ర రైతాంగానికే అవమానమన్నారు. మొత్తం మీద, తమ సొంత రాజకీయాలకు ఆలవాలంగా మారిన మీడియా వార్ చంద్రబాబుకు, వైయస్ జగన్ కు మధ్య రగులుతోంది. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా మీడియా పని చేస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని అంటున్నారు.

కామెంట్‌లు