ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సబ్సిడీ హెచ్చింపునకు ప్రభుత్వం అంగీకారం

హైదరాబాద్, డిసెంబర్ 23 రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ)ని ఆరువేల రూపాయల నుంచి ఏడువేల రూపాయలకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే కేరళ, తమిళనాడు తరహా సాయం అందించాలని ప్రతిపక్షాలు కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ఆర్థిక పరిస్థితి అనుమతించని కారణంగా ఇంతకుమించి ముందుకు వెళ్లలేమని ముఖ్యమంత్రి చెప్పడంతో ...
ఆగ్రహించిన సి.పి.ఐ. సమావేశంనుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీలో చెప్పినమాటకే కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. సచివాలయంలో గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన అఖిలపక్షంలో ప్రభుత్వం నుంచి ఈమేరకు అంగీకారం వెలువడగా, ఎనిమిది వేల రూపాయలకు ఈ మొత్తాన్ని పెంచాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుపట్టాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం తీవ్రరూపం దాల్చుతున్నందువల్ల సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించుకోవాలని ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలూ ఆకాంక్షిస్తున్నాయి. అయితే ఉభయపక్షాలూ గత రెండు రోజులుగా ఎవరి పంతం వారిదే అంటున్నట్టు వ్యవహరించడంతో పరిస్థితి సానుకూలం కాలేదు. చివరికి బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో గురువారం మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశానికి అందరూ అంగీకరించడంతో పరిస్థితిలో కొంత సానుకూలత ఏర్పడినట్టు ఒక దశలో కనిపించినా, ఆ తర్వాత ప్రభుత్వం మొండికేయడంతో చర్చలు విఫలమైనట్టు తెలుస్తున్నది. రైతు సమస్య పరిష్కారానికి వీలుగా సచివాలయంలో గురువారం మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం అనుకున్న సమయానికే ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున కోడందరెడ్డి, బుద్ధ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొనగా, తెలుగుదేశం పార్టీ తరపున యనమల, నాగం. మోత్కుపల్లి, బొజ్జల పాల్గొన్నారు. ఇంకా ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరపున నారాయణ, రామకృష్ణ, రాఘవులు, టి.ఆర్.ఎస్. తరపున ఈటెల, నాయిని, భారతీయ జనతా పార్టీ తరపున కిషన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి, వేదవ్యాస్, ఎం.ఐ.ఎం. తరపున పాషాఖాద్రి ఈ చర్చలలో పాల్గొన్నారు. అయితే ఎంతో కీలకమైన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి వివేకానంద రెడ్డిగాని, రెవెన్యూ శాఖ మంత్రి ఆనం గాని హాజరు కాలేదు.

కామెంట్‌లు