ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని పార్టీ అధికార ప్రతినిథి షకీల్ అహ్మద్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరనందుకే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక రాగానే తుది నిర్ణయం తీసుకుంటామని ఏఐసిసి ఆఫీసులో
ఆయన విలేఖర్లతో అన్నారు. నివేదిక అందిన తరువాతే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ ఎంపీలు దీక్షలు చేస్తున్న విషయాన్ని విలేఖర్లు ఆయన దృష్టికి తీసుకెళ్తుండగానే ఆయన జోక్యం చేసుకుని చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని వివరించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక త్వరలోనే వస్తుందంటూ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది తాను చెప్పలేనన్నారు.శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేకంగా సిఫార్సు చేస్తే ఏం చేస్తారని ఒక విలేఖరి ప్రశ్నించగా ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదనేది చాలా సార్లు చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ చేసిన ప్రకటన ప్రస్తావించగా అది రాజకీయ లబ్ధికోసం చేసిన ప్రకటన అన్నారు. కెసిఆర్ తన రాజకీయం కోసమే తెలంగాణ ఉద్యమం చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే, రాజకీయం కోసం ఉద్యమం చేస్తున్న వ్యక్తి తన పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేస్తారు? అని ఆయన ఎదురు ప్రశ్న చేశారు.

కామెంట్‌లు