ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు తెలుగు మీడియాతో శ్రీకృష్ణ భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, సమైక్యాంధ్ర యథాతథంగా కొనసాగింపునకు సంబంధించిన అంశాలపై వివిధ వర్గాల వారీ అభిప్రాయాలను సేకరించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈనెల 31న తన నివేదికను అందచేస్తుండటంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కేంద్ర హోం మంత్రి చిదంబరంకి ఈ నివేదికను
కమిటీ అందచేస్తుంది. నివేదికను అందచేయటానికి ముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మంగళవారం ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియాతో కొంత సేపుమాట్లాడుతుందని అధికార ప్రతినిథి తెలిపారు. అయితే ప్రభుత్వానికి అందచేయనున్న నివేదిక గురించి కమిటీ సభ్యులు మాట్లాడరని, తమ కమిటీ పని ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియచేయటానికే ఈసమావేశం ఉద్దేశమని తెలిసింది. కాగా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక ఎలా ఉంటుంది? ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందా? ఉండదా? అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ, సీమాంధ్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కార మార్గాలను మాత్రమే సూచించే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే పక్షంలో హైదరాబాద్‌పై తీసుకోవలసిన కీలక నిర్ణయంపై కమిటీ చేసే సిఫార్సుపైనే సస్పెన్స్ నెలకొని ఉంది. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికలో సంచలనాత్మక సిఫార్సులుండే అవకాశాలులేవని చెబుతున్నారు. డిసెంబర్ 31న కమిటీ నివేదికను అందచేసిన తరువాత హోం శాఖ పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తన నివేదికను అందచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈనివేదికను పరిశీలించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందిన తరువాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై తామెలాంటి డెడ్‌లైన్లు విధించబోమని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో వేడేక్కుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం త్వరితంగా ఒక నిర్ణయం తీసుకోక తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్‌లు