ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది

విజయవాడ, డిసెంబర్ 23 : రైతు కోసం ఎంతో ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్ఫూర్తి ఏమాత్రం లేని రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. అవునా కాదా అని వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన చెప్పారు.
ఈ ప్రభుత్వంపై ఇలాంటి రైతు ఆందోళనలు ఇంకా ముమ్మరం చేస్తాం అని హెచ్చరించారు. ఎంతో ఘోర విపత్తు సంభవించి రైతు దిక్కు తోచని స్థితిలో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన విరుచుకుపడ్డారు. రైతు పండించిన ధాన్యం తడిచిపోతే, రంగు మారిపోతే ప్రభుత్వం కాక మరెవరు కొంటారని జగన్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రైతు సోదరుడు ఏ గోదారిలోకి పోవాలి అని అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇక ఎవరు పట్టించుకోవాలి, తినడానికి లేని పరిస్థితిలో ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరించడంలో నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొందూ దొందేనని ఆయన విరుచుకుపడ్డారు. ప్రకృతి వైపరీత్యానికి తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతన్నల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఒక రైతు ఇచ్చిన నిమ్మరసం త్రాగి జగన్ గురువారం 12 గంటలకు తమ 48 గంటల లక్ష్య దీక్ష విరమించారు. దీక్ష విరమించే ముందు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ వై.ఎస్. స్ఫూర్తి ఈ సర్కారుకు ఉందా ? రైతుల పట్ల అనుసరిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి సరైనదేనా ? అని సభను ఉద్దేశించి ప్రశ్నించారు.

కామెంట్‌లు