ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాష్ట్ర మంతటా ఎడతెరిపిలేని వర్షాలు

-మట్టి గోడలు విరిగిపడి ఇద్దరి మృతి
హైదరాబాద్‌: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రమంతటా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మట్టి గోడలు నాని పడిపోతున్నాయి. ప్రకాశం జిల్లా చింతగారిపాలెంలో ఓ వృద్ధురాలు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో ఓ వ్యక్తి గోడలు కూలి మృతి చెందారు. కోస్తాంధ్ర,
పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. అవనిగడ్డ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో వేల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలో వేలాది ఎకరాల్లో వరిపన్నలు తడిసి ముద్దవుతున్నాయి. విజయవాడలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ విస్తారంగా జల్లులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల్లోని పొగాకు పంటకు తీవ్ర నష్టం కలిగింది. విజయనగరం జిలాల్లోనూ కరుస్తున్న వర్షాల కారణంగా వరిపంట నాశనమవుతోంది. నల్గొండ జిల్లా కాళ్ల మండలంలో 5వేల ఎకరాల్లో వరి, 2 వేల ఎకరాల్లో వరినారుమళ్లు నీటమునిగాయి. రామచంద్రాపురంలో పొగాకు, మొక్కజొన్న పత్తి నీట మునిగింది. తుని, అవనిగడ్డ పాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేసి, వెయ్యి క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు. దెందులూరు, పెదపాడు, ఏలూరు, చీరాల వేటపాలెం ప్రాంతాల్లో మినుములు, వేరుశెనగ పాడైంది. వేటపాలెంలో 10 సెంమీ వర్షపాతం నమోదైంది. పిఠాపురం ఉలవపాడు వద్ద మున్నేరు పొగుతోంది. ఖమ్మంలో 7, కొత్తగూడెంలో 5 సెంమీ వర్షం నమోదైంది.

కామెంట్‌లు