ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరి

-భాజపా నేత వెంకయ్యనాయుడు
విశాఖపట్నం, చైతన్యవారధి: ఉగ్రవాదుల దాడుల్లో జవాన్లు మరణిస్తే సంతాపం. గాయపడితే నష్టపరిహారం చెల్లించడంమినహా తీవ్రవాదుల దుశ్చర్యలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలేదని భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు విమర్శించారు. దేశ ఆర్థిక రాజధానిపై ఉగ్రవాదులు దాడులు చేసి రెండేళ్లు పూర్తయింది. ఇందులో అశువులు బాసిన అమరవీరుల ఆత్మశాంతి కోరుతూ విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి శుక్రవారం  ఆయన పూలమాల వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా, రక్షణపరంగా దెబ్బతీసేందుకు తీవ్రవాదులు కుట్రపన్నుతున్నా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంలేదన్నారు. దేశ భక్తులపై కఠినంగా వ్యవహరిస్తూ వ్యతిరేకులపై మెతక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదులు దఫదఫాలుగా జరిపిన దాడుల్లో పలువురు జవానులు మరణించినా ఇందుకు బాధ్యులెవరనేది ఇప్పటికీ కనుగొనలేకపోయినట్లు తెలిపారు. బీహార్లో భాజపా-జేడీయూ కూటమి విజయంపై మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధికి పట్టంగట్టారని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ అంశాలకు అతీతంగా ప్రజలు అభివృద్ధికి మొగ్గుచూపడం శుభపరిణామమని వెంకయ్యనాయుడు వివరించారు. బీహార్‌వంటి పెద్ద రాష్ట్రాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కంభంపాటి హరిబాబు, యువమోర్చా జాతీయ కార్యదర్శి పి.వి.ఎన్‌.మాధవ్‌, భాజపా నగర శాఖ అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, సీనియర్‌ నేత చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు