ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ముగిసిన జీవీఎంసీ ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌

విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): డీఎస్సీ-2008 ద్వారా జీవీఎంసీ పాఠశాలకు ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌  ముగిసింది. జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం నాలుగున్నర వరకు సాగింది. 116 మందికి గాను 115 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీటిల్లో మూడు ఉర్దూ, రెండు ఒరియా, నాలుగు వికలాంగుల పోస్టులను భర్తీచేశారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ముందు అధికారులు రోస్టర్‌ పాయింట్ల జాబితాను, పాఠశాలల ఖాళీల వివరాలను నోటీసు బోర్డులో తెలపలేదు. దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఖాళీ జాబితాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికియూనియన్‌ నాయకులు మద్దతు తెలిపారు. చివరకు అధికారులు ఆ వివరాలను ప్రకటించారు. దీంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. అభ్యర్థులకు ప్రవేశ ఉత్తర్వులు ఇంకా అందాల్సి ఉంది. జీవీఎంసీ కమిషనర్‌ విష్ణు నగరంలో అందుబాటులో లేనికారణంగా ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. సోమవారం వీటిని ఇచ్చే అవకాశం ఉంది. జీవీఎంసీ అదనపు కమిషనర్‌ (ఫైనాన్స్‌) పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరిగింది. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారిణి జయకుమారి, ఆర్థిక సలహాదారు వై.మంగపతిరావు, పాఠశాలల పర్యవేక్షకులు విమలకుమారి, ఏపీటీఎఫ్‌ నగర అధ్యక్షుడు సింగంపల్లి వెంకటరమణ, యూటీఎఫ్‌ నాయకుడు పైడి కృష్ణారావు, ఎంపీ శ్రీనివాసరావు, జీవీఎంసీ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు