ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైద్యులు అలసత్వం వహించరాదు

విజయనగరం, నవంబర్ 21(చైతన్యవారధి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు విధుల్లో సమయపాలన పాటించి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో పి.హెచ్‌.సి వైద్యులకు జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు పూటలు ఉండి వైద్యులు సేవలు అందించాలని సూచించారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తే ప్రసవాలకు ఘోషాసుపత్రికి వరకు ఎందుకొస్తారని ప్రశ్నించారు. 108 వాహనాలు ఉండడం వల్ల ప్రతి ప్రసవ కేసుని ఘోషాసుపత్రికి పంపిస్తున్నారని, అవిలేకపోతే పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. కుటుంబ నియంత్రణ లక్ష్యాలను శతశాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్‌ డీఎంహెచ్‌ఓ ఎస్‌.చంద్రారెడ్డి మాట్లాడుతూప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు సకాలంలో హజరుకావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సమయపాలన పాటించని వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్‌ 1లోగా పాఠశాల ఆరోగ్య కార్యక్రమం పూర్తికావాలన్నారు. ప్రతి పాఠశాల్లో ఉన్న ఉపాధ్యాయులు ఫోన్‌ నెంబర్లను పి.హెచ్‌.సి వైద్యుల వద్ద ఉంచుకోవాలని సూచించారు. సరైన నివేధికలతో రాని వైద్యులపై ఆయన మండిపడ్డారు. ముందుగా కలెక్టర్‌ పి.హెచ్‌.సివారిగా సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయనివారణ అధికారి టి.రామారావు, వ్యాధినిరోధక టీకాల జిల్లా అధికారి జి.వరలక్ష్మి, ఇంఛార్జ్‌ జిల్లా మలేరియా నివారణ అధికారి ఇ.విజయ్‌కిషోర్‌, సీనియర్‌ మెడికల్‌ అధికారి ప్రభాకర్‌, డిప్యూటీ డెమాలు బి.ఎస్‌.అశోక్‌కుమార్‌, ప్రసాద్‌, ఎస్‌.ఓ వి.పద్మజ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు