ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కాంగ్రెస్ అధినేత్రి సోనియాకే గురిపెట్టిన జగన్

హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపైనే ఎదురు దాడికి దిగారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో, టీవీ చానెల్లో వార్తాకథనం ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెసు నాయకులు కొంత మంది వైయస్ జగన్ పై ప్రత్యక్ష సమరానికి దిగారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సాక్షి వార్తాకథనాన్ని వ్యతిరేకించారు. వైయస్సార్ ఎప్పుడు కూడా సోనియాపై, రాజీవ్ పై విమర్శలు చేయలేదని చెప్పారు. వైయస్సార్ ఏనాడూ కాంగ్రెసు జెండాను వీడలేదని చెప్పారు. తద్వారా ఆయన వైయస్ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారనే అనుకోవాలి. కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యక్షంగానే వైయస్ జగన్ పై విమర్శలు చేశారు. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. సాక్షిని నిషేధించాలని శంకరరావు డిమాండ్ చేశారు. సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం ఇచ్చినందుకు 24 గంటలలోగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే సాక్షి కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కూడా అన్నారు. వైయస్ జగన్ అహంభావానికి ఆ వార్తాకథనం నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైయస్ జగన్ పై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వైయస్ జగన్ సాధ్యమైనంత తొందరగా పార్టీని విడిచిపెట్టి, సొంత పార్టీ పెట్టే ఉద్దేశంతోనే సోనియాపై ప్రత్యక్ష పోరుకు దిగారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దానికితోడు, అధిష్టానం నాడిని పట్టుకోవడానికి ఆయన ఈ వార్తాకథనం ద్వారా ప్రయత్నించారా అనే సందేహం కూడా కలుగుతోంది. అయితే, ఇంత దాకా వచ్చిన తర్వాత వైయస్ జగన్ ను పార్టీ అధిష్టానం సహించబోదనే మాట వినిపిస్తోంది.

కామెంట్‌లు