ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ట్రాన్స్‌కో ఉద్యోగిపై ఫ్రిర్యాదు

అనకాపల్లి, నవంబర్ 21(చైతన్యవారధి): వ్యవసాయ కనెక్షన్ కోసం ట్రాన్స్‌కో చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో వినియోగదారుడు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఆమ్యామ్యాల కోసం కుంటి సాకులతో తనను వేధిస్తున్నారని ఆరోపించడంతో దర్యాప్తు జరుగుతోంది. బాధితుడు రాజకీయ నేత కావడంతో వాతావరణం మరిం త వేడెక్కింది. మూడు నెలల క్రితం ఒక విని యోగదారుడు వెళ్లి వ్యవసాయ కనెక్షన్ ఇప్పించమని కోరాడు. సదరు ట్రాన్స్‌కో ఉద్యోగి వినియోగదారుడ్ని కొద్ది రోజులు తిప్పించి చివరికి బేరసారాలు ఆడడం ప్రారంభించాడు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో సదరు వినియోగదారుడు మాలాంటి నాయకుల వద్ద నుంచి కూడా ఆమ్యామ్యాలు అడుగుతారా అని ప్రశ్నించాడు. దీనికి ట్రాన్స్‌కో ఉద్యో గి సమాధానమిస్తూ నాకు మంత్రుల అండదండలున్నాయి. నేను కూడా బీసీ ఉద్యోగినేనని సమాధానం చెప్పి అధికార పార్టీ నాయకుడికి ఝలక్ ఇచ్చాడు. లోవోల్టేజి సాకు చూపి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని లేకుంటే కనీసం తగిన పారితోషికం అందించాలని చెప్పడంతో వినియోగదారుడు అక్కడి నుంచి వెనుదిరి గారు. ట్రాన్స్‌కో ఉద్యోగిపై ఇతర ఆరోపణలను సైతం సేకరించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రాన్స్‌కో విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి అన్ని ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి రాతపూర్వకమైన ఫిర్యాదులు తీసుకున్నారు.

కామెంట్‌లు