ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

శ్రీలంక అధ్యక్షుడిగా రాజపక్సే ప్రమాణం

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా మహీందా రాజపక్సే(65) రెండోధపా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక డిసిల్వా ఆయనతో ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌, భూటాన్‌ ప్రధానమంత్రి జిగ్మే థిన్లే అతిథులుగా హాజరయ్యారు. అధ్యక్షుడి ప్రమాణస్వీకారం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా సెలవుదినం పాటించారు. పాఠశాలల్లో విద్యార్థుల కోసం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. వారంరోజులపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాణాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ), మార్స్కిస్టు-లెఫ్టిస్టు జేవీపీ పిలుపునివ్వడంతో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ రెండు పార్టీలు మద్దతిచ్చిన మాజీ సైనికాధిపతి శరత్‌ఫోన్సెకా అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సే చేతిలో ఓటిమి పాలయ్యారు. రాజపక్సే తన వైభోగాన్ని చాటుకోవడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని యూఎన్‌పీ నేత జయసూర్య విమర్శించారు.శ్రీలంకను ఆసియాలో అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దుతానని అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన ప్రసంగించారు. శాంతి సౌభాగ్యాలతో కూడిన సరికొత్త శ్రీలంకను ఆవిష్కరిస్తానని చెప్పారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తానన్నారు. తాను ఇచ్చిన హామీలన్నింటినీ తప్పనిసరిగా నెరవేరుస్తానని పేర్కొన్నారు.

కామెంట్‌లు