ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సోనియా నియంత- తుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి

తిరుపతి : ఇంగ్లీషు రాజ్యం పోయి ఇటలీ పాలన వస్తుందేమోనని తుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోనియాను నియంతతో పోల్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో తిరుపతికి చెందిన జగన్‌ వర్గీయుడుగా ముద్రపడ్డ చెవిరెడ్డి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం విశేషం. 'భారత దేశం అంతా సోనియా గాంధీ తనసొంత సామ్రాజ్యమైనట్లు.. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒక సామంతరాజ్యం అయినట్లు ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని దెబ్బతీయడమే. దేశంలో పరిస్థితులు గమనిస్తుంటే ఇంగ్లీషు పాలన పోయి ఇటలీ పాలన వస్తుందేమోనని భయమేస్తుంది..'అని పేర్కొన్నారు. 'వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం కాంగ్రెసుకు ఓట్లు వేసి ప్రస్తుత ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ మహానేత మరణించాక.. ఆయన కుమారుడ్ని స్వార్థంతో, అవకాశవాదంతో ఈ ప్రజాప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులు, ఆడుతున్న నాటకాలు గమనిస్తున్న ప్రజలు అలాంటి వారందరికీ జీవితాంతం గుర్తుండేలా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంద'ని తెలిపారు. '1989 నుంచి 1994దాకా సీఎల్పీ సభ్యుల అభిప్రాయం ప్రకారం కాకుండా సీల్డ్‌ కవర్‌లో ముఖ్యమంత్రులను నిర్ణయించి.. బలవంతంగా రాష్ట్రంపై రుద్దిన ఫలితంగానే తరవాత 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు స్థానాలు 25కు పడిపోయిన విషయాన్ని మరువకూడద'ని గుర్తుచేశారు. 'రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటుంటే.. కనీసం ఒక్క సీఎల్పీ సభ్యుని అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా నియంతృత్వంగా ఢిల్లీ నుంచి తెచ్చిన సోనియా సందేశాన్ని సభ్యులకు వినిపించి, బలవంతంగా ఆమెకే సీఎం ఎంపిక నిర్ణయాధికారాన్ని కట్టబెట్టేలా ఆమోదింపజేసుకున్నారు. ఆ వెంటనే హడావిడిగా సీఎం అభ్యర్థిని ప్రకటించి రాత్రికి రాత్రే అధిష్టాన దూతలు ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇదేనా 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీ నేర్పించిన సంస్కృతి 'అని చెవిరెడ్డి ప్రశ్నించారు.

కామెంట్‌లు