ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పరీక్షల వాయిదాతో భగ్గుమన్న సీమాంధ్ర

చైతన్యవారధి: తెలంగాణ విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గి ఎస్సై రాత పరీక్షల్ని వాయిదావేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నంప్రకటించింది. పరీక్షల నిర్వహణకు అనువైన వాతావరణం లేనందున రాష్ట్రవ్యాప్తంగా వాయిదావేస్తున్నట్లు హోంమంత్రి సబిత ప్రకటించారు. దీంతో నాలుగైదు రోజులుగా అట్టుడుకుతున్న తెలంగాణ ప్రాంతం శాంతించింది.  అయితే ప్రభుత్వ ప్రకటన వెలువడిన మరుక్షణం సీమాంధ్ర ప్రాంతం భగ్గుమంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఆత్మహత్యా యత్నాలతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వివిధ నగరాలు, పట్టణాలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి రోశయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండుచేశారు. తెలంగాణ హోంమంత్రిని అడ్డుకోలేని సీమాంధ్ర మంత్రులు కూడా తమ పదవుల్ని వదులుకోవాలంటూ గళమెత్తారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, పరీక్షల్ని యథాతథంగా నిర్వహించకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శనివారం సీమాంధ్రలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాసలు పిలుపునిచ్చాయి. 14 విశ్వవిద్యాలయాల పరిధిలో బంద్‌ పాటిస్తామని ప్రకటించాయి. ప్రభుత్వం గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఎస్సై రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండుచేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శుక్రవారం రాత్రి ఇద్దరు నాయకులు ఆమరణ దీక్షకు దిగారు. సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఏయూ కన్వీనర్‌ లగుడు గోవిందరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్‌ కాంతారావులు రాత్రి 10 గంటల సమయంలో దీక్షకు పూనుకున్నారు. మొత్తంమీద నిన్నామొన్నటి దాకా తెలంగాణలో కనిపించిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు సీమాంధ్రలోతలెత్తాయి.

కామెంట్‌లు