ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఫొటోలు లేని ఓటర్లను తొలగించండి

-తహసిల్దార్లను ఆదేశించిన కలెక్టర్‌
విజయనగరం, నవంబర్ ౨౧(చైతన్యవారధి): ఓటర్ల జాబితాలో ఫొటోలు లేని ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ ఎం.వీరబ్రహ్మయ్య తహసిల్దార్లకు సూచించారు. అయితే ముందుగా ఫొటోలు సేకరించడం, ఇవ్వని వారికి నోటీసులు ఇచ్చిన తరువాత తొలగించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో మండల తహసిల్దార్లుతో శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియపై అడిగి తెలుసుకున్నారు. చేర్పులకు దరఖాస్తుల స్వీకరణ, పెండింగ్‌లో ఉన్న ఫొటోలు సేకరణ వివరాలు అడిగారు. విజయనగరం పట్టణంతో పాటు చాలా మండలాల్లో ఎక్కువగా ఫొటోలు సేకరించాల్సి ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫొటోలు సేకరించడంలో జాప్యమెందుకని ప్రశ్నించారు. ఇన్ని సార్లు ఫొటోలు అడిగినా ఇవ్వలేదంటే వారు గ్రామంలో లేకపోయి ఉండవచ్చునన్నారు. కావున ఫొటో సేకరించడమో, తొలిగించడమో చేయాలన్నారు. అయితే ఓటు తొలిగించిన తరువాత తమ వద్ద గల ఓటరు, ఇతర గుర్తింపు కార్డులు తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కారణాల వల్ల తమ ఓటు తీసేసారని ఆరోపించడం గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలు లేకుండా నోటీసులిచ్చి నిర్ధారించుకుని తొలగించాలని సూచించారు. అంతకుముందు కురుపాంలో అతి తక్కువ ఫొటోలు సేకరించడంపై ఆర్డీవోను అంబేద్కర్‌ను ప్రశ్నించారు. అక్కడ తహసిల్దారు, ఇతర సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో శతశాతం ఫొటోల సేకరణ జరిగేలా చూడాలన్నారు. జమాబందీపై సమీక్షిస్తూ 18 మండలాల్లో పూర్తి కాకపోవడంపై ఆసహనం వ్యక్తం చేశారు. ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని బొబ్బిలి తహశీల్దారుపై మండిపడ్డారు. నవంబరు నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఆపద్బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సోమవారం కలెక్టరు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు అటవీ హక్కుల కల్పన కార్యక్రమం నత్తనడకన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ప్రగతి రెండు నెలలు కిందట ఉన్నట్లే ఉందని అసంతృప్తి వ్యక్తంచేశారు. అంతకుముందు, తరువాత జేసీ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ పంటల నష్టం, ఇతర అంశాలపై సమీక్షించారు. జాబితాలు అందరి వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నివేదిక కంప్యూటరు పత్రాల్లో పంపించాలన్నారు. సోమవారానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్వో వై.నరసింహారావు, విజయనగరం ఆర్డీవో ఎస్‌.ఢిల్లీరావు, అన్ని మండలాల తహశీల్దార్లు కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు