ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చంద్రబాబు పర్యటన షెడ్యూలు ఇదే...

విశాఖపట్నం, నవంబర్ 10: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు చర్చించారు. 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు నాయుడు విశాఖ వినామాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి పెందుర్తి, కొత్తవలస, ఎస్.కోట మీదుగా అనంతగిరి చేరుకుంటారు. బాక్సైట్ సమస్యపై గిరిజనులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కె.కోటపాటు చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు చోడవరం మండలం శీమునాపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు అంబేర్‌పురం వెళ్లి సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.రి సాయంత్రం ఆరు గంటలకు వడ్డాది, రావికమత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి పాయకరావుపేట చేరుకుని అక్కడే బస చేస్తారు. 19వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు నక్కపల్లిలోని ఉప్మాక దేవాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. 10 గంటలకు చందనాడ గ్రామంలో, 11 గంటలకు రాజయ్యపేట, 12 గంటలకు డి.ఎల్.పురంలో ఎ.పి.ఐ.ఐ.సి. భూ సేకరణ సమస్యలపై ప్రసంగిస్తారు. 1.30 గంటలకు ఏటికొప్పాకలో భోజన విరామం. 2.30 గంటలకు అడ్డురోడ్డులో జరగనున్న బహిరంగ సభలో చంద్ర బాబు ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు అచ్యుతాపురంలో ఎస్.ఇ.జెడ్.నిర్వాసితుల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు వెన్నెలపాలెం జంక్షన్‌లో బహిరంగ సభ. ఆ రోజు రాత్రికి నగరానికి చేరుకుని హోటల్‌లో బస చేస్తారు. 20వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. 10 గంటలకు విశాఖ నార్త్ నియోజకవర్గంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 11 గంటలకు సింహాచలం చేరుకుని ఈనాం భూముల సమస్యలపై జరిగే సదస్సులో పాల్గొంటారు. 12 గంటలకు విమ్స్ ఆసుపత్రిని సందర్శించి పిపిపి విధానాన్ని రద్దు చేయాలని, అలాగే నిధులు మంజూరు చేయాలన్న డిమాండ్లతో ప్రసంగిస్తారు. 1.30 గంటలకు భోజన విరామం. 2.30 గంటలకు గాజువాక నిర్వాసితుల సదస్సులో పాల్గొంటారు. 4.30 గంటలకు విశాఖ సౌత్ నియోజకవర్గంలో కాలుస్య సమస్యపై ప్రసంగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలోని జి.వి.ఎం.సి. పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి నగరంలోనే బస చేసి 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళతారు.

కామెంట్‌లు