ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అక్రమాదాయంతో సాక్షి టీవీ-చంద్రబాబు

కాకినాడ: అక్రమాదాయంతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సాక్షి టీవీని, చానెల్ ను పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మద్య నియంత్రణ కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. వంతాడ అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఓ పత్రిక తప్పుడు వార్త రాసిందని ఆయన సాక్షి పత్రికపై దుమ్మెత్తిపోశారు. అవినీతి పత్రిక తనపై రాసిందని, ఆ పత్రిక సంగతి తాను చూసుకుంటానని ఆయన అన్నారు. నీ తండ్రి వైయస్సార్ పైనే పోరాడిన వ్యక్తి అని, నీకు భయపడేది లేదని ఆయన వైయస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి అక్రమ మైనింగ్ చేస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. వంతాడ మైనింగ్ ను తమ ప్రభుత్వ హయాంలో రద్దు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం స్టే ఇచ్చిందని ఆయన అన్నారు. తాను వదిలి పెట్టేది లేదని, గిరిజనుల పక్కన ఉంటానని ఆయన చెప్పారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డవారి నుంచి డబ్బులు రాబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి డబ్బుల కోసం అక్రమ మైనింగులో పాలు పంచుకున్నారని, ఆ మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. అవినీతి మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మీడియా భ్రష్టు పట్టిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన విమర్శించారు. మద్య నియంత్రణ కోసం మహిళలు చైతన్యవంతులై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతిపై తాము నిరంతరం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరకడం కష్టంగా ఉంది గానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరకుతోందని ఆయన అన్నారు. ప్రజలను ప్రభుత్వమే తాగుడుకు అలవాటు చేస్తోందని ఆయన అన్నారు. తాగుడుకు అలవాటు పడి మగవాళ్లు కుటుంబాలను కూడా మరిచి పోతున్నారని ఆయన అన్నారు. రాత్రిపగలు తేడా లేకుండా ప్రజలు తాగుతున్నారని, దీని వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుందని ఆయన అన్నారు.

కామెంట్‌లు