ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జాతి నిర్మాణంలో భాగస్వాములను చెయ్యాలి

మనుషుల్లో రోజు రోజుకూ అత్యాశ, అసూయ, అసహనం, స్వార్ధం హింసాత్మక ధోరణి పెరిగిపోతోంది. ఇది సమాజాన్ని దుర్భర పరిస్థితులకు చేరువచేస్తోంది. దీంతో తరువాత తరాల వారు జాతి నిర్మాణంలో చేయి కలపాల్సింది పోయి తిరోగమనం దిశగా ప్రయణిస్తూ నైతికంగా పతనమౌతున్నారు. ఈ పరిస్థితిని అధికమించాలంటే చిన్నప్పుడే మనిషిలో విలువలకు విలువనిచ్చే గుణాన్ని పెంపొందించాలి. మొక్కలుగా ఉన్నప్పుడే వారిని సమాజ పునర్నిర్మాణం వైపు దృష్టి సారించేలా, సంఘానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలి. సమాజపరమైన అవగాహన కల్పించాలి. తరువాత తరాలను మేలుకొలుపే విధంగా వారిని తయారు చెయ్యాలి. సమాజంలో తమ బాధ్యతలు, హక్కులను వివరించాలి. సమాజంలో ఏ విధంగా మెలగాలో వీరికి చెప్పాలి. ఒక విషయాన్ని నేర్చుకోవడం ఎలా? ఏ విధంగా ఆలోచించాలి? అయోమయ పరిస్థితి నుంచి బయటపడటమెలా? ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఎవరైనా బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఎలా స్పందించాలి? ఆపదలు వస్తే తప్పించుకొనే మార్గాలేమిటి వంటి విషయ పరిజ్ఞానాన్ని వారికి అందించాలి. జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే నిష్ణాతులుగా వారిని తయారు చెయ్యాలి. దీనికి వారిని శారీరకంగా, మానసికంగా సిద్ధం చెయ్యాలి. నైతిక విలువలు, ప్రవర్తన, లక్ష్యాల ఆవశ్యకతను వివరించాలి. వీరిలో పోరాట పటిమను, సృజనాత్మకతను పెంపొందించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, అందివచ్చిన అవకాశాన్ని జీవితానికనుగుణంగా మలచుకోవడం నేర్పాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, నిర్ణయాలను తీసుకోవడం, బాధ్యతను భుజాలకెత్తుకోవడం, ఒత్తిడిని భరించి విజయంతో ముందుకు సాగడం ఎలాగో వారికి అనుభవంలోకి తేవాలి. సమాజసేవ, ఆధ్యాత్మిక జీవిత ఆవశ్యకతను అనుభవపూర్వకంగా తెలియజేయాలి. అప్పుడే మానవ సమాజం పది కాలాల పాటు సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు ప్రయత్నం చెయ్యాలి. దీనికి కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంది.

కామెంట్‌లు