ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైభవంగా ఉపమాక ఉత్సవాలు

నక్కపల్లి, చైతన్యవారధి: ఉపమాకలో వెలసిన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి అంకురార్పణతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో తొలిరోజైన శనివారం నుంచి స్వామివారి తిరువీధి సేవలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు నిత్యారాధన, కొండపై మూలవిరాట్టుకు అభిషేకం, శేష హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టదిక్పాలకులకు గరుడగజ్జెలతో ప్రత్యేక ఆవాహన కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడిని పల్లకిలో ఉంచి ఉపమాక మాఢవీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామంలో అష్టదిక్పాలకులకు ఆవాహన, బలిహరణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. ఆపై స్వామివారికి నీరాజన మంత్రపుష్ప కార్యక్రమం నిర్వహించారు. స్వామిని ఆలయంలో ఉంచి రాజభోగ నివేదన, తీర్థగోష్ఠి, ప్రసాదవినియోగం చేశారు. దీంతో ఉదయం కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాయంత్రం ధ్వజారోహణ మినహా మిగతా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ చిలువూరి రామసూర్యనారాయణరాజు (పెంకులరాజు) కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు