ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పసుపుతో కేన్సర్‌కు చికిత్స


హ్యూస్టన్‌: కేన్సర్‌ చికిత్సలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే పదార్థాన్ని సిస్ల్పాటిన్‌ అనే ఔషధంతో కలిపితే, కేన్సర్‌ చికిత్సకు ఇచ్చే కీమోథెరపీ సామర్థ్యం పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మెదడు, మెడ కేన్సర్‌కు చికిత్సలో ఇది సాయపడుతుందని వారు వివరించారు. ఈ పరిశోధన బృందానికి భారత సంతతికి చెందిన ఎరి శ్రీవత్సన్‌ నాయకత్వం వహించారు. పసుపులో అనేక వైద్య గుణాలు ఉన్న సంగతి ఎన్నో ఏళ్లుగా అందరికీ తెలుసు. ఇది వాపు, మంటలను తగ్గిస్తుందని రుజువైంది. కొన్ని రకాల కేన్సర్లను అణచివేస్తుందని లోగడ జరిగిన అధ్యయనాల్లోనూ తేలింది. మెదడు, మెడ కేన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఆలస్యంగా గుర్తిస్తే శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి ఇవ్వాల్సి ఉంటుందని పరిశోధనలో పాలుపంచుకున్న మరిలినా వాంగ్‌ చెప్పారు. శ్రీవత్సన్‌, వాంగ్‌లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో కర్కుమిన్‌ ద్వారా మెదడు, మెడ కేన్సర్లు నయమవుతాయని తేలింది. సిస్ల్పాటిన్‌ చాలా విషతుల్యమైన మందు. మెదడు, మెడ కేన్సర్లపై పోరుకు ఇచ్చే డోసులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే.. దీనివల్ల మూత్రపిండాలు, చెవులు, ఎముక మజ్జ దెబ్బతింటాయి. ఈ మందులో కర్కుమిన్‌ను కలపడం వల్ల సిస్ల్పాటిన్‌ డోసును తగ్గించవచ్చని వాంగ్‌ చెప్పారు. దీనివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు తగ్గుతాయని వివరించారు.

కామెంట్‌లు